For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ మొత్తానికి ఆమే పెద్ద సెలబ్రిటీ

Mayanti Langer reacts to the tweet on Rishabh Pant being Kohli-ABD amalgamation

హైదరాబాద్: ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారంలో టీవీ స్క్రీన్‌లపై అభిమానుల ఉత్కంఠ, స్టేడియానికి హాజరైన సెలబ్రిటీలనే చూపిస్తుంటారు. అలా అన్ని మ్యాచ్‌లకు ఒకే సెలబ్రిటీ రావడం విశేషమే కదా. ఇలా మ్యాచ్‌ ఉంటే చాలు ఆమె స్టేడియంలో ప్రత్యక్షమవుతారు. ఆమె మరెవరో కాదు స్టూవర్ట్‌ బిన్నీ భార్య మయాంతి లాంగర్‌. టీమిండియా క్రికెటర్‌ భార్యగా తొలుత ప్రపంచం ఆమెను గుర్తించినా తర్వాత స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌, కామెంటెటర్‌‌గా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం వృత్తి నైపుణ్యంతో ఆమె అందరినీ ఆకట్టుకుంటున్నారు. మయాంతిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కామెంటెటర్‌ డీన్‌ జోన్స్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. ఐపీఎల్‌లో తాను ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ అందరిలోనూ మయాంతి లాంగర్‌ బెస్ట్‌ అండ్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌ అని కితాబిచ్చారు. ఆమె తన వృత్తిపట్ల ఎంతో నిబద్దతతో ఉంటారని, గ్రేట్‌ జాబ్‌ మయాంతి అని ట్వీట్‌లో రాసుకొచ్చారు మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌.

ఐపీఎల్‌లో మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగే చర్చలో ఆమె తన విలువైన అభిప్రాయాలను షేర్‌ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. యాంకర్‌, కామెంటెటర్‌ మయాంతి లాంగర్‌ భర్తే క్రికెటర్‌ బిన్నీ అంటూ నెటిజన్లు తరచుగా కామెంట్లు చేయడం తెలిసిందే.

మరి ఫైనల్ మ్యాచ్ సన్‌రైజర్స్vsసూపర్ కింగ్స్ మ్యాచ్‌లోనూ ఈమె కనిపించనున్నారు. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. దాదాపు రెండు నెలలుగా జరుగుతోన్న ఈ సమరానికి ముగింపు వేడుక వాంఖడే వేదికగా జరగనుంది.

Story first published: Sunday, May 27, 2018, 12:57 [IST]
Other articles published on May 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+