
హైదరాబాద్: మయాంతి లాంగర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమాలకు చిరపరిచితమైన పేరు. చక్కటి అందంతో పాటు మంచి వాక్‌చాతుర్యంతో ఆకట్టుకునే మయాంతికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. మ్యాచ్‌కి ముందు, ఇన్నింగ్స్ బ్రేక్, మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో జరిగే చర్చల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెన్‌లో యాంకర్‌గా బోల్డంత క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. ఐపీఎల్ 2020కి మాత్రం అందుబాటులో లేరు.
మయాంతి లాంగర్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'అమ్మతనంలోని నిజమైన ఆనందం' అని మయాంతి ఆ ఫోటోకి కెప్టెన్ ఇచ్చారు. మయాంతి బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తుండగా.. చిన్నారి హాయిగా నవ్వుతున్నాడు. దీంతో మయాంతి అమ్మతనంలోని ప్రేమని ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ 2020లో యాంకరింగ్ చేస్తే మయాంతి ఎంత బిజీగా ఉండేవారో.. ఇప్పుడు తన బాబు ఆలనాపాలనలతో కూడా అంతే బిజీగాఉన్నారు.
మయాంతి లాంగర్ పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. 'మయాంతి లాంగర్.. బాబు చాలా బాగున్నారు' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్‌లో నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. అందమైన బాబు మిమ్మల్ని బిజీగా ఉంచుతున్నాడు. దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు', 'త్వరలోనే మిమ్మల్ని చూస్తాం అని ఆశిస్తున్నా', 'మేడమ్.. ఐపీఎల్ 2020లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం' అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో పనిచేస్తున్న మయాంతి.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న విషయం తెలిసిందే. బిన్నీ సతీమణి కంటే.. యాంకరింగ్ ద్వారానే ఆమె పాపులర్ అయ్యారు.

మయాంతి లాంగర్ ఒక్క ఐపీఎల్‌కు మాత్రమే వ్యాఖ్యతగా వ్యవహరించలేదు. ఇతర మెగా టోర్నీలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. జీ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ అయిన ఫుట్‌బాల్ కేఫ్‌తో పాటు అనేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా ఇటు యాంకర్‌గా అటు కామెంటేటర్‌గా వ్యవహరించింది. 2011 వరల్డ్ కప్ , 2014 ఇండియన్ సూపర్‌లీగ్,2015 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్,2018 2019లో జరిగిన ఐపీఎల్‌తో పాటు 2019లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌కు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరించారు.