హైదరాబాద్: మయాంతి లాంగర్... క్రికెట్ తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ భార్యగా.... భారత జట్టు ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ ఆడినా టీవిలో
కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
ఇటీవల భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో కూడా ఆమె కామెంటేటర్ బాధ్యతలు నిర్వహించింది. ఇప్పుడు బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సిద్ధమౌతోంది. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆమె భారత క్రికెటర్ సురేశ్ రైనాను వైఫై పాస్‌వర్డ్ అడిగి సోషల్ మీడియాలో వార్త అయ్యారు.

అసలేం జరిగిందంటే!
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ని కవర్ చేసేందుకు గాను మయాంతి లాంగర్ కాన్పూర్‌కు చేరుకుంది.
అదే సమయంలో రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న సురేశ్ రైనా కూడా అక్కడే ఉన్నాడు. మయాంతి తన ఫోన్‌లో వైఫై ఆన్ చేయగానే సురేశ్ రైనా నెట్‌వర్క్ చూపించింది. దీంతో వెంటనే ఆ ఫోటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసి 'రైనా.. నీ వైఫై పాస్ వర్డ్ చెప్పవూ' కామెంట్ పెట్టింది.
అయితే, మయాంతి లాంగర్ పోస్టుకి సురేశ్ రైనా నుంచి సమాధానం రావడానికి ముందే నెటిజన్లు మాత్రం ఆమెకు సలహాలతో పాటు వ్యంగ్యంగా స్పందించారు. ఇటీవలే, కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మయాంతి లాంగర్ తన భార్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్యూ చేయడం అప్పట్లో పెద్ద వార్త అయింది. బ్రాడ్ కాస్టింగ్ కవరేజ్‌లో భాగంగా ఆ మ్యాచ్‌కు హాజరైన మయాంతి తన భర్తను ఇంటర్వ్యూ చేసింది.