'అనుకోలేదు.. 37 ఫోన్లు, 300 మెసేజ్‌లు చూసి షాక్'

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహకులకు సొమ్ములు తెచ్చిపెడుతుండటంతో పాటు.. ఎంతో మంది యువ క్రికెటర్లకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రాణించిన క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మయాంక్ మార్కండే. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో మయాంక్‌ను ముంబై ఇండియన్స్ రూ.20లక్షలకు దక్కించుకుంది.

ఐపీఎల్ లోకి తీసుకుంటారనుకోలేదు:
అరంగేట్రం ఐపీఎల్ సీజన్‌లోనే మయాంక్ అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ మయాంక్ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. దీంతో పాటు తన ఖాతాలో 8 వికెట్లను వేసుకుని అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను సైతం అందుకున్నాడు. తాజాగా మయాంక్ ఈ ఐపీఎల్ సీజన్ కోసం జనవరిలో వేలం నిర్వహించిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

37 ఫోన్లు, 300 మెసేజ్‌లు:
అప్పుడు పంజాబ్ జట్టు తరఫున అండర్ -23 గేమ్ ఆడుతున్నాను. మ్యాచ్ జరిగే రోజుల్లో ఆటగాళ్లు మైదానంలోకి ఫోన్లు తీసుకెళ్లకూడదు. సాయంత్రం మ్యాచ్ అనంతరం ఫోన్‌ను ఆన్ చేశాను. అంతే వరుసగా ఫోన్‌కు మెసేజ్‌లు, మిస్డ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. 37 ఫోన్లు, 300 మెసేజ్‌లు వచ్చాయి.

నేను నమ్మలేదు:
స్నేహితులు ఫోన్ చేసి ఐపీఎల్ 11కు సెలక్ట్ అయ్యావ్. ముంబై ఇండియన్స్ నన్ను దక్కించుకుందని చెప్పారు. కానీ, నేను నమ్మలేదు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజర్ రాహుల్ సంఘ్వీ ఫోన్ చేశారు. అప్పుడు నమ్మాను' అని మయాంక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

వేలంలో కొనుక్కుంటారని అనుకోలేదు:
వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొన్నాను. వేలంలో నన్ను కొనుక్కుంటారని మాత్రం అనుకోలేదు. ముంబై ఇండియన్స్ తరఫున, ఐపీఎల్‌లో బాగా రాణించాలి. ప్రస్తుతం ఇదే నా ముందున్న లక్ష్యం' అని మయాంక్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications