Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓ ఇంటివాడైన క్రికెటర్ మయాంక్ అగర్వాల్: హాజరైన కేఎల్ రాహుల్

Mayank Agarwal Ties the Knot With his Longtime GirlFriend
Mayank Agarwal Set to Tie Knot With Long-time Girlfriend Aashita Sood

హైదరాబాద్: రంజీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మయాంక్‌ అగర్వాల్‌ సోమవారం ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి ఆషిత సూద్‌ను వివాహమాడాడు. ఈ పెళ్లికి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా మయాంక్‌ ఆగర్వాల్‌తో పాటు స్నేహితులతో దిగిన ఫొటోలను కేఎల్ రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఐదు నెలల క్రితం ఆషిత సూద్‌‌కు మయాంక్ అగర్వాల్ లండన్‌లోని ప్రఖ్యాత లండన్ ఐలో తన ప్రేయను వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే.

Mayank Agarwal Set to Tie Knot With Long-time Girlfriend Aashita Sood

వెంటనే ఆషిత ఒప్పుకోవడం... ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సైతం వీరి పెళ్లికి అంగీకరించడంతో సోమవారం అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమయిర్ లీగ్ (ఐపీఎల్)లో మయాంక్ అగర్వాల్ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచ్‌లాడిన మయాంక్‌ 120 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్‌లో ఆరంభంలో మంచి ప్రదర్శన చేసిన పంజాబ్‌ ఆ తర్వాత వరుస ఓటములు కారణంగా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.

ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్‌కు త్వరలో ఇంగ్లాండ్ పర్యటకు వెళ్లే భారత్-ఏ జట్టులో చోటు దక్కలేదు. కాగా, కర్ణాటకకు చెందిన మయాంక అగర్వాల్ ఈ సీజన్‌లో 2,141 పరుగులు చేయడంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మన్‌గా అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.

2003 వరల్డ్ కప్ సందర్భంగా అంటే సరిగ్గా 15 ఏళ్ల క్రితం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డుని కూడా మయాంక అగర్వాల్ బద్దలు కొట్టాడు. ఈ వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 11 మ్యాచ్‌లాడి 61 యావరేజితో 673 పరుగులు నమోదు చేశాడు.

ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా మయాంక అగర్వాల్ ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 723 పరుగులు నమోదు చేశాడు.

Story first published: Monday, June 4, 2018, 20:54 [IST]
Other articles published on Jun 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+