పంజాబ్ కింగ్స్ లీడర్‌గా అర్ష్‌దీప్.. మయాంక్ అగర్వాల్ చెప్పేశాడు

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో ఆర్‌సీబీ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకోగా.. పంజాబ్ సజీవంగా ఉంచుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్‌తో ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనగా.. పంజాబ్ కింగ్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండడం ప్లస్ రన్ రేట్ ఉండడం సానుకూలాంశం. రెండింట్లో గెలిస్తే ప్లేఆఫ్ చేరుకోవడానికి అవకాశాలుంటాయి. కాగా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) చెలరేగారు. అలాగే బౌలింగ్లో కగిసో రబడా 3వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. దీంతో ఆర్సీబీ 9వికెట్లు కోల్పోయి 155పరుగులే చేయగలిగింది.

డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ హవా
వికెట్ల గురించి పక్కన పెడితే ఐపీఎల్ - 2022లో ఇప్పటివరకు అత్యంత కన్సిస్టెన్సీ బౌలర్‌గా అర్ష్‌దీప్ పేరొందాడు. అతను వికెట్ టేకర్ కానప్పటికీ (12 మ్యాచ్‌లలో 7 వికెట్లు) అద్భుతమైన ఎకానమీ రేట్ మెయింటెన్ చేస్తూ ఈ సీజన్లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పంజాబ్ కింగ్స్‌కు కీలకమైన బౌలర్‌గా మారాడు. అతను ఇప్పటివరకు సీజన్‌లో 7.69ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ అన్‌క్యాప్డ్ ఇండియన్ బౌలర్ అర్ష్‌దీప్‌ను 'లీడర్' ఆఫ్ పీబీకేఎస్‌గా పేర్కొన్నాడు.

బాధ్యత తీసుకుంటాడు
మ్యాచ్ అనంతరం మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. అర్ష్‌దీప్ చాలా ఎనర్జిటిక్ పర్సన్, చాలా కాన్ఫిడెంట్ ప్లేయర్. తను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. అతను జట్టులో నాయకుడని చెప్పాలి. అతను టీంలో అందరి చుట్టూ తిరుగుతూ కోఆర్డినేట్ చేస్తాడు. బాధ్యత తీసుకుంటాడు. కొన్నిసార్లు బౌలర్లతో కూడా మాట్లాడతాడు అని మయాంక్ తెలిపాడు. మేము బ్యాట్‌లో మెరుగ్గా రాణించాం. వికెట్ కొంచెం బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. జానీ, లివి బ్యాటింగ్ చేసిన విధానం సూపర్. పరిస్థితులను అర్థం చేసుకోవడం, వికెట్‌ను అవగాహన తెచ్చుకుని ఆడడమే మేం చేసిన పని అని మయాంక్ తెలిపాడు.

దినేశ్ కార్తీక్‌ను ఔట్ చేసిన అర్ష్‌దీప్
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆదిలో తడబడ్డా గ్లేన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటీదార్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. 10ఓవర్లకే 3వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 104పరుగులతో ఇన్నింగ్స్ ఛేజింగ్ వైపు సాగుతుండగా ఆ స్కోరు వద్దే పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఔటయ్యారు. దీంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ కు కళ్లెం పడింది. ఇక ఆ జట్టు హిట్టర్ దినేశ్ కార్తీక్ ఇంకా క్రీజులో ఉండడంతో ఆర్సీబీకి గెలుపుపై ఆశలు మాత్రం ఉన్నాయి. కానీ ఆ ఆశలకు కళ్లెం వేసేలా అర్ష్ దీప్ సింగ్.. దినేశ్ కార్తీక్‌ను ఔట్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications