'సరైన ప్రణాళికతోనే నాథన్ లయాన్ ముప్పు నుంచి బయటపడ్డా'


హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 118 పరుగులు (76,42) చేసి విదేశీ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ ఆటగాడిగా నిలిచాడు.
ఈ సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తాను సిద్ధం చేసుకున్నట్లు మయాంక్ తాజాగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో స్పష్టం చేశాడు. తొలి రెండు టెస్టుల్లో 16 వికెట్లు సాధించిన మంచి ఊపు మీద ఉన్న లయాన్ అడ్డుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించానని అన్నాడు.
మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో
"మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోచ్ రవిశాస్త్రి సర్ నా వద్దకు వచ్చారు. నా అరంగేట్రంపై ఒక స్పష్టత ఇచ్చారు. ఆ సమయంలో నేను కాస్త ఆందోళనకు లోనయ్యా. ఆ సీన్‌ను వాస్తవంలో తలుచుకుంటే ఏదో తెలియని ఫీలింగ్.. ఒక వైపు ఆనందం.. మరొకవైపు కాస్త భయం. ఆ సమయంలో నేను లయాన్ కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకోవాలనుకున్నా" అని చెప్పుకొచ్చాడు.
నాథన్ లయాన్ బౌలింగ్‌ను ఎలా ఆడాలనే దానిపై
"బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సర్, కేఎల్ రాహుల్‌లు లయాన్ బౌలింగ్‌ను ఎలా ఆడాలనే దానిపై చర్చిస్తున్నారు. అందులో నేను భాగస్వామ్యం అయ్యా. మేమంతా లయాన్ బంతిని సంధించే విధానంపై సుదీర్ఘంగా చర్చించా. ప్రాక్టీస్ సెషన్‌లో అదే పనిగా లయాన్‌ను ఎదుర్కోవడంపై చెక్ చేసుకున్నా. అదే ప్రణాళికను మ్యాచ్‌లో కూడా అవలంభించి సక్సెస్ అయ్యా" అని మయాంక్ వివరించాడు.
చాలా సంతోషంగా అనిపించింది
ఈ సిరిస్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసిన ఓ స్టార్ స్పిన్నర్‌ను ఎదుర్కొని విజయవంతం కావడం చాలా సంతోషంగా అనిపించిందని మయాంక్ తెలిపాడు. కాగా, ఈ సిరిస్‌లో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాయంక్ అగర్వాల్ 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి టీమిండియాకు చక్కటి శుభారంభాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.
మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు
దీంతో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన మూడో భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో పాటు తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లు ఘోరంగా విపలం కావడంతో మయాంక్‌ను అదృష్టం వరించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications