For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు: ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ ఖాతాలో రికార్డు

Mayank Agarwal records top score for an Indian Test debutant in Australia

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం చేసిన టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేసిన మయాంక్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌‌కు చేరుతున్నా... ఆసీస్ బౌలర్లను సమర్ధవతంగా ఎదుర్కొని క్రీజులో పాతుకుపోయి 42 పరుగులు చేశాడు. అరంగేట్ర టెస్టులో మయాంక్ 118 పరుగులు చేశాడు. దీంతో విదేశీ గడ్డపై తొలి టెస్టులో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో మయాంక్‌ రెండో స్థానంలో నిలిచాడు.

1
43625

అంతకముందు ఈ జాబితాలో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ 132 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 118 పరుగులతో అగర్వాల్‌ రెండోస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో ఎల్‌ఎస్‌ రాజ్‌పుత్‌ (93 పరుగులు), ఎస్‌ఎస్‌ నాయక్‌ (81 పరుగులు), ఎంహెచ్‌ మంకడ్‌ (77 పరుగులు) ఉన్నారు.

ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. శనివారం తొలి సెషన్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (42) పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

Story first published: Saturday, December 29, 2018, 12:41 [IST]
Other articles published on Dec 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+