Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు!

భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. మంచినీళ్లుగా భావించి విమానంలో హానికర ద్రవం తాగడంతో తీవ్రమైన అనారోగ్యంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఈ సంఘటనపై మయాంక్ తన మేనేజర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలేం జరిగిదంటే.. రంజీట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడటకం కోసం కర్ణాటక జట్టు త్రిపుర రాజధాని అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. మంచినీళ్లుగా భావించి తన సీటు ఎదురుగా ఉన్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగాడు. ఆ తర్వాత అతడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు.

Mayank Agarwal complained to the police after his health worsened on the flight

వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి వచ్చింది. హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యుల సూచనల మేరకు అతడిని బెంగళూరుకు తీసుకువచ్చే ఏర్పాట్లలో కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఉంది.

అయితే ఈ ఘటనపై ఆస్పుత్రి నుంచి తన మేనేజర్‌ సహాయంతో మయాంక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై త్రిపుర ఆరోగ్యశాఖ కార్యదర్శి కిరణ్ గట్టె స్పందించారు. మాయాంక్‌ను ఎమర్జెన్సీలో చేర్చించి చికిత్స అందించామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

కాగా, మయాంక్ అగర్వాల్ భారత్ తరఫున 21 టెస్టులు, అయిదు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 41 సగటుతో 1488 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 31, 2024, 9:40 [IST]
Other articles published on Jan 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+