న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మయాంక్.. రెండో వికెట్ అవుట్ 123/2

India vs Australia: Mayank Agarwal Creates History By Scoring 76
Mayank Agarwal-Cheteshwar Pujara Stand Puts India Ahead In Melbourne

మెల్‌బౌర్న్‌: మెల్‌బౌర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టుతో అరంగేట్రం భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అదరగొట్టాడు. ఇలా తొలి అంతర్జాతీయ టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా బలమైన ఆసీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని పాట్ కమిన్స్ బౌలింగ్‌లోనే టిమ్ పైనె క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో భయపెడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా ఛతేశ్వర పుజారా సైతం ఆతితూచి ఆడి 33 పరుగులుతో క్రీజులో ఉన్నాడు. దీంతో మరో సారి టీమిండియా రెండో వికెట్‌ను చేజిక్కించుకున్నాడు కమిన్స్. భారత్ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.

ప్రస్తుతం చెతేశ్వర్ పూజారా (33), విరాట్ కోహ్లీ(0) పరుగుల వద్ద క్రీజులో ఉన్నారు. భారీ అంచనాలతో కొత్త ఓపెనర్ జోడిగా బరిలోకి దిగిన విహారీ, మయాంక్‌ల భాగస్వామ్యం అనుకున్నంతగా రాణించలేకపోయింది. విహారీ ఆరంభంలోనే తడబడి పెవిలియన్ చేరుకున్నాడు. రెండో టెస్టులో మిడిలార్డర్‌లో వచ్చిన విహారిపై నమ్మకముంచి ఈసారి ఓపెనర్‌గా పంపించారు.

ఆదిలోనే ఆటంకం, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఆదిలోనే ఆటంకం, తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

అయితే మయాంక్ శుభారంభాన్ని ఇచ్చినా.. విహారి మాత్రం విఫలమయ్యాడు. కమ్మిన్స్ విసిరిన బౌన్సర్‌ను అంచనా వేయలేకపోయిన విహారి(66 బంతుల్లో 8).. దాని నుంచి తప్పించుకునే క్రమంలో స్లిప్‌లో ఫించ్‌కు దొరికిపోయాడు.

1
43625

దీంతో 40 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా వచ్చారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ ద్వారా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్రకెక్కాడు.

Story first published: Wednesday, December 26, 2018, 10:13 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X