న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మయాంక్‌కు అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది: గావస్కర్‌

IND vs BAN,2nd Test : Sunil Gavaskar Says 'Hope Mayank Maintains Batting Form In His 2nd Year Also'
Mayank Agarwal Batting Beautifully, Hope he Keeps Scoring in His Second Season says Sunil Gavaksar

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తొలి ఏడాది బాగా ఆడాడు. ఇక మయాంక్‌కు అసలైన పరీక్ష వచ్చే ఏడాది ఎదురవుతుందని భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. మయాంక్‌ గతేడాది ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి అతడికి ఎదురులేకుండా పోయింది. సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ పరుగులు చేయలేక జట్టులో స్థానం కోల్పోగా.. మయాంక్‌ మాత్రం అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. ఏడాది వ్యవధిలోనే జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు.

డేనైట్‌ టెస్టు.. బంతిని నీటిలో ముంచి ప్రాక్టీస్ చేస్తున్న బంగ్లా!!డేనైట్‌ టెస్టు.. బంతిని నీటిలో ముంచి ప్రాక్టీస్ చేస్తున్న బంగ్లా!!

క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు:

క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు:

స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గావస్కర్‌ మాట్లాడుతూ మయాంక్‌ బ్యాటింగ్‌ను కొనియాడారు. 'ప్రస్తుతం మయాంక్‌ టెస్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఇది అతనికి మొదటి సంవత్సరమే. రెండో ఏడాది కూడా అతను ఇలానే పరుగులు చేయాలని ఆశిస్తున్నా. అయితే మయాంక్‌కు అసలైన నిజమైన పరీక్ష భవిష్యత్తులో ఎదురవడం ఖాయం' అని గావస్కర్‌ అన్నారు.

అసలు పరీక్ష అప్పుడే:

అసలు పరీక్ష అప్పుడే:

'రెండో ఏడాది మయాంక్‌ బ్యాటింగ్‌ గురించి ప్రత్యర్థి జట్లకు ఎక్కువ సమాచారం తెలుస్తుంది. దాంతో మయాంక్‌పై బౌలర్లు సీరియస్‌గా దృష్టి పెడతారు. అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మాత్రం చూడముచ్చటగా ఆడుతున్నాడు. మయాంక్‌ ఫ్రంట్‌, బ్యాక్‌ ఫుట్‌ వర్క్‌ బాగుంది. ఆఫ్‌ సైడ్‌ షాట్లు కొట్టేటప్పుడు అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఇబ్బంది కనబడుతుంది. ఆఫ్‌ సైడ్‌ షాట్లను కూడా ఏ మాత్రం వంగకుండా నేరుగా కొడుతున్నాడు' అని గావస్కర్‌ పేర్కొన్నారు.

ఎనిమిది మ్యాచ్‌ల్లోనే రెండు డబుల్‌ సెంచరీలు:

ఎనిమిది మ్యాచ్‌ల్లోనే రెండు డబుల్‌ సెంచరీలు:

మయాంక్‌ అగర్వాల్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనే రెండు డబుల్‌ సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో 215 బాదిన మయాంక్‌.. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో కెరీర్‌ అత్యుత్తమ స్కోర్‌ 243 సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.రెండు డబుల్‌ సెంచరీలు సాధించి ఓపెనర్‌ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పరుగుల వరద పారించి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 11వ స్థానానికి చేరుకున్నాడు.

Story first published: Tuesday, November 19, 2019, 15:30 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X