Ganesh Chaturthi 2020: ఈ కష్ట సమయంలో గణేశుడు మనల్ని రక్షిస్తాడు: కోహ్లీ

దుబాయ్: భారత దేశ వ్యాప్తంగా 'వినాయక చవితి' ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అందరూ ఇంట్లోనే పూజలు జరుపుకోవాల్సి వస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు ఇళ్ళలో పర్యావరణ హితంగా వినాయక ప్రతిమలని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు సైతం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం యూఏఈకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు కూడా అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భారత కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సారథి విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు చవితి శుభాకాంక్షలు చెప్పాడు. 'ఈ కష్ట సమయంలో గణేశుడు మనలను రక్షిస్తాడు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సురక్షితంగా ఉండండి. మీ ప్రియమైనవారితో ఈ రోజును గొప్పగా ఆనందించండి' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.
ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అభిమానులకు చవితి శుభాకాంక్షలు చెప్పారు. 'వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మరియు మీ కుటుంబసభ్యులకు సంతోషం కలగాలని కోరుకుంటున్నా' అని ధావన్ ట్వీట్ చేశాడు. 'గణేశుడు మీ జీవిత ప్రయాణాన్ని ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నా. కొత్త ప్రారంభాలు అందాలి. చవితి శుభాకాంక్షలు' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
'గణపతిబప్ప మోరియా. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. గణేశుడు మన జీవితాలన్నిటినీ మెరుగుపర్చడానికి జ్ఞానం మరియు అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని హెడ్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన ఆయా ఫ్రాంఛైజీలు సైతం తమ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పాయి. కరోనా మహమ్మారి నుంచి అందరినీ కాపాడాలని వినాయకుడిని కోరాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications