మే 25: టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యేకం, నాలుగు సెంచరీలు
హైదరాబాద్: మే 25, 2007... టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజు. టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో వరుసగా మొదటి నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించిన రోజు ఇది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది.
సుమారు పదేళ్ల క్రితం టీమిండియా నమోదు చేసిన రికార్డుని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండయా ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.

తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు దినేష్ కార్తీక్(129), వసీం జాఫర్(138) సెంచరీలు చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్(129), సచిన్ టెండూల్కర్ (122)లు సైతం సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

ద్రవిడ్‌తో కలిసి వసీం జాఫర్ సెంచరీ
జట్టు స్కోరు 175 పరుగుల వద్ద కార్తీక్ గాయంతో రిటైర్డ్ హాట్‌గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ ద్రవిడ్‌తో వసీం జాఫర్ ఇన్నింగ్స్ కొనసాగించి సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్ కూడా గాయంతో రిటైర్ట్ హట్‌గా పెవిలియన్ చేరాడు.

వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసిన టీమిండియా
దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్, ద్రవిడ్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలివికెట్‌కు 408 పరుగులు చేసింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ అవుటవ్వడంతో వినూమన్కడ్-పంకజ్ రాయ్ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది.

నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు
అనంతరం రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగిన కార్తీక్ క్రీజులోకి వచ్చి సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్ శర్మకు ఇదే తొలి మ్యాచ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications