ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తాజాగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఐపీఎల్‌లో ఎక్కువసార్లు (19) డకౌట్ అయిన ప్లేయర్ గా రికార్డుకు ఎక్కాడు. అయితే ఇప్పుడీ విషయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అతడు డకౌట్ కాలేదని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
గుజరాత్ బౌలర్ సాయికిశోర్ సంధించిన బంతిని మ్యాక్సీ రివర్స్ స్వీప్ బాదేందుకు ప్రయత్నించాడు. కానీ అది కాస్త బోల్తా కొట్టింది. బంతి నడుము వద్ద తాకడం వల్ల గుజరాత్ ప్లేయర్స్ అప్పీలు చేశారు. ఇక ఫీల్డ్ అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించాడు. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న శ్రేయస్‌తో ఈ విషయం గురించి ఏం చర్చించకుండానే వెళ్లిపోయాడు మ్యాక్సీ. అయితే రిప్లేలో మాత్రం బంతి వికెట్లను తాకలేదని తేలింది. అంపైర్ నిర్ణయం తప్పని తేలింది. కాబట్టి మ్యాక్సీ.. డీఆర్‌ఎస్ తీసుకొని ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది.

తిడుతోన్న ఫ్యాన్స్..
ఇదే విషయంపై మ్యాచ్ సమయంలో డగౌట్‌లో ఉన్న కోచ్ రికీ పాంటింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అభిమానులు కూడా మ్యాక్సీని తిడుతున్నారు. కనీసం డీఆర్‌ఎస్ తీసుకొని ఉంటే ఫలితం అనుకూలంగా ఉండేది కదా అని చెబుతున్నారు. అనవసరంగా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. కాగా, గతేడాది కూడా ఆర్సీబీ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్.. అప్పుడు కూడా అభిమానులను నిరాశపరిచాడు. పెద్దగా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు.