న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్: ఇంగ్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం

By Nageshwara Rao
Maxwell survives to steer Australia past England

హైదరాబాద్: హోబర్ట్ వేదికగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌ రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 103 నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా టీ20 స్కోరుకార్డు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఒకానొక దశలో 14 ఓవర్లు ముగిసే సరికి 122/4తో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్‌ ఆ తర్వాత 33 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మలాన్‌ (50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

మాక్స్‌వెల్‌ (3/10), అగర్‌ (2/15) ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆటే హైలైట్‌‌గా నిలిచింది. ఒకవైపు సహచరులు పెవిలియన్‌ చేరుతున్నా తన వీరోచితి ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌‌ని గెలిపించాడు.

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్ మరో 9 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. టి20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది రెండో సెంచరీ. 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 11:03 [IST]
Other articles published on Feb 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X