For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: మళ్లీ నిరాశ పరిచిన మ్యాక్స్ వెల్‍.. జట్టు నుంచి ఉద్వాసన తప్పదా.. !

 Maxwell failed in the ongoing match against Ireland

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లేన్ మ్యాక్స్ వెల్ తన ఫ్లాప్ షో కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐర్లాండ్ తో జరుగుతున్ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు. 9 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాక్స్ వెల్ ఈ మ్యాచ్ లోనే కాదు దాదాపు గత 10 మ్యాచ్ ల్లో తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు. మ్యాక్సీ గత 10 ఇన్నింగ్స్ ల్లో 13 (9), 23 (12), 28 (20), 8 (9), 8 (11), 1 (4), 0 (3), 6 (11), 0 (1), 1 (3) పరుగులు చేశాడు. దీంతో అతన్ని ప్లేయింగ్ 11 ఉంచడం అవసరమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాగా ఈ మ్యాచ్ లోమొదట బ్యాటింగ్ చేసిన కంగారులు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేశారు. ఐర్లాండ్ ముందు 180 పరుగులు విజయలక్ష్యాన్ని ఉంచారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆదిలోనే డెవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. మెక్‌కార్తీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్, కెప్టెన్ ఫించ్ తో కలిసి మ్యాచ్ ను ముందుకు నడిపించారు. 22 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ మెక్‌కార్తీ బౌలింగ్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ 13 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టోయినిస్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ క్రమంలో ఫించ్ ఆఫ్ సెంచరీ చేశాడు. 44 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్లతో 63 పరుగులు చేశాడు.

స్టోయినిస్ 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, మూడు ఫోర్లు ఉన్నాయి. టిమ్ డెవిడ్ 15 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ వెడ్ 7 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ 3 వికెట్లు తీయగా.. లిటిల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మెక్‌కార్తీ అద్భత ఫీల్డింగ్ చేశాడు. 14 ఓవర్ రెండో బంతిని అదిర్ వేయగా.. స్టోయినిస్ దాన్ని సిక్స్ కొట్టాలని పైకి లేపాడు. బంతి గాల్లో లేచింది. పరుగెత్తుకుంటూ వచ్చిన మెక్‌కార్తీ క్యాచ్ పట్టాడు. కానీ బౌండరీలో పడిపోతున్నానని తెలిసి బంతిని బయటకు వేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు రెండు పరుగులే వచ్చాయి.

Story first published: Monday, October 31, 2022, 15:44 [IST]
Other articles published on Oct 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+