Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాక్స్‌వెల్‌కు దక్కని చోటు: వన్డే సిరిస్‌కు ఆసీస్ జట్టు ఎంపిక

Maxwell dropped; Lynn and Paine recalled

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు మరోసారి ఆ దేశ క్రికెట్ బోర్డు మొండిచెయ్యి చూపించింది. యాషెస్ టెస్టు సిరిస్ అనంతరం ఇంగ్లాండ్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ మేరకు బుధవారం ప్రకటించిన వన్డే జట్టులో మ్యాక్స్‌వెల్‌‌కు చోటు దక్కలేదు.

ఆస్ట్రేలియా తరుపున ఇప్పటివరకు 80 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ను ఎంపిక చేసేందుకు అటు సెలక్టర్లు, ఇటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పెద్దగా ఆసక్తికనబరచలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో నిలకడగా బ్యాటింగ్‌ చేయడంలో మ్యాక్స్‌వెల్‌ విఫలమవుతున్నాడు.

దీంతో టెస్టు సిరిస్‌కు ఎంపికకాకపోయినా, వన్డే సిరిస్‌కు అయినా ఎంపిక చేస్తారని ఎదురుచూసిన మ్యాక్స్‌వెల్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు స్పిన్నర్‌ క్రిస్‌ లిన్‌ను వన్డే సిరిస్‌కు ఎంపిక చేశారు. ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతుంది.

ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత జనవరి 14వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కమ్మిన్స్, ఆరోన్ ఫించ్, హాజెల్ ఉడ్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, టిమ్ పైనీ, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 16:53 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+