Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన రికార్డు ఇదే (ఫోటోలు)

హైదరాబాద్: ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అతడు వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు.

సోమవారం నాటి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 22 బంతుల్లో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మూడో వికెట్‌కు ఓపెనర్ ఆమ్లాతో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఐపీఎల్‌‌లో 1000 పరుగులు పూర్తి చేసిన 53వ ఆటగాడిగా నిలిచాడు.

అత్యధిక స్ట్రయిక్ రేటు

అత్యధిక స్ట్రయిక్ రేటు

ఇంతక ముందు 52 మంది ఈ ఘనత సాధించినప్పటికీ వీరందరికంటే అత్యధిక స్ట్రయిక్ రేటుతో మ్యాక్స్‌వెల్‌ వెయ్యి పరుగులు పూర్తి చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 45 మ్యాచ్‌‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 164.75 స్ట్రయిక్ రేటుతో 1005 పరుగులు సాధించాడు.

22 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్

22 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్

సోమవారం హోల్కర్‌ స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో మరో 33 బంతులు మిగులుండగానే పంజాబ్ నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది.

4110 పరుగులతో కోహ్లీ

4110 పరుగులతో కోహ్లీ

ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 4110 పరుగులతో ఐపీఎల్‌లో అందరికంటే ముందున్నాడు. సురేశ్‌ రైనా (4098), రోహిత్‌ శర్మ (3874), గౌతమ్‌ గంభీర్‌ (3847) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐదో స్థానంలో క్రిస్ గేల్

ఐదో స్థానంలో క్రిస్ గేల్

ఇక టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 153.2 స్ట్రయిక్ రేటుతో 3464 పరుగులు సాధించాడు. గేల్‌‌తో పోలిస్తే మ్యాక్స్‌వెల్‌ స్ట్రయిక్ రేటు ఎక్కువ ఉండడం విశేషం. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ విజయం సాధించగా.. మూడో మ్యాచ్‌ ఆడిన బెంగళూరుకు ఇది రెండో ఓటమి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+