ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన మాజీ ఫాస్ట్ బౌలర్ మ్యాక్స్ వాల్కర్ (68) కన్నుమూశారు. రెండేళ్లుగా చర్మ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న వాల్కర్.. బుధవారం నాడు మృతి చెందినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.
1973లో ఆస్ట్రేలియా తరుపున ఆరంగ్రేటం చేసిన వాల్కర్ 34 టెస్టు మ్యాచ్ లు ఆడి 138 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తన మీడియం పేస్ బౌలింగ్ తో అందరిని ఆకట్టుకున్న వాల్కర్ కు ట్యాంగిల్స్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. 1975లో మెల్ బోర్న్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కెరీర్ లో 143/8 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు వాల్కర్. 1974-1981 మధ్యలో 17 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించారు.