అశ్విన్-ఆండర్సన్ గొడవ: నవ్వుకున్నా, కోపం రాలేదన్న కోహ్లీ
ముంబై: తన బ్యాటింగ్ టెక్నిక్ అంత గొప్పగా ఏమీ లేదంటూ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆండర్సన్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆండర్సన్ చేసిన విమర్శలు తనకు తెలియవని కోహ్లీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'అండర్సన్ నాపై చేసిన వ్యాఖ్యల గురించి ఈ రోజు మ్యాచ్ ముగిసే వరకు తెలియదు. అది కూడా అశ్విన్ వచ్చి నాతో చెప్పినప్పుడే ఈ విషయం తెలిసింది. అశ్విన్ చెప్పగానే నవ్వుకున్నానే తప్ప, కోపం రాలేదు' అని కోహ్లీ తెలిపాడు.
ఇతరుల తప్పుల గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడికి రాలేదని ఆండర్సన్‌ని ఉద్దేశించి కోహ్లీ ఈ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఐదో రోజైన సోమవారం మ్యాచ్‌లో అశ్విన్-అండర్సన్‌ల మధ్య మాటల యుద్ధం తెరలేచిందని కోహ్లి తెలిపాడు. అయితే వారిద్దరూ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసుకోలేదని కోహ్లీ స్పష్టం చేశాడు.

గొడవ కాకుండా ఆపా
అండర్సన్ బ్యాటింగ్ దిగిన సమయంలో అశ్విన్ ఈ విషయంపై అతనితో మాట్లాడుతుంటే నేను వారి వద్దకు వెళ్లి గొడవ కాకుండా ఆపానని కోహ్లీ పేర్కొన్నాడు. ‘క్రికెట్‌లో ఇవన్నీ సర్వసాధారణమే, ఎటువంటి గొడవలు లేకుండా ముందుకు సాగుదాం పదా. అని అండర్సన్‌తో అన్నాను.' అని కోహ్లీ చెప్పాడు.

ఆండర్సన్‌తో గొడవకు కారణం అదే
నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత తనపై చేసిన వ్యాఖ్యలకు అసంతృప్తి చెందిన అశ్విన్ ఆ రకంగా ఆండర్సన్‌తో గొడవ పడి ఉండొచ్చని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లాండ్‌పై ఈ సిరిస్ విజయం అత్యంత మధురమని కోహ్లీ తెలిపాడు. ఈ మధ్య కాలంలో తాము సాధించిన సిరిస్ విజయాలకంటే ఇదే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

ఆటగాడిగా, కెప్టెన్‌గా నాకు ఎంతో ప్రత్యేకం
‘ఇప్పటి వరకు గెలిచిన సిరీస్‌లన్నీ ఒకెత్తు. ఇది ఒకెత్తు. ఈ సిరీస్ విజయం మరుపురానిది. ఆటగాడిగా, కెప్టెన్‌గా నాకు ఇదెంతో ప్రత్యేకమైనది' అని కోహ్లీ అన్నాడు. ముంబై టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్‌పై 3-0తో భారత్ టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఓర్వలేని ఆ జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

భారత్ విజయానికి కారణం ఇక్కడి స్లో పిచ్‌లే
భారత్ విజయానికి కారణం ఇక్కడి స్లో పిచ్‌లే అంటూ ధ్వజమెత్తాడు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌లను తయారు చేసినందువల్లే ఇంగ్లాండ్ ఘోరంగా ఓటమి పాలైనట్లు ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతకాదు భారత్ పిచ్‌లను రూపొందించే క్రమంలో పాటించాల్సిన సాంకేతిక పద్ధతులను పాటించలేదని ఆండర్సన్ విమర్శించాడు.

కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు
ఇదంతా కూడా విరాట్ కోహ్లే చెప్పడం వల్లే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ అప్పట్లో బ్యాటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేశాడు. ‘కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు. అతడి బ్యాటింగ్‌లో లోపాలు ఇక్కడి పిచ్‌లపై కనిపించడం లేదంతే. పిచ్‌ల్లో వేగం, స్వింగ్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌లో మాదిరిగా అతడిని ఔట్ చేయలేపోయాం' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications