Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డు బ‌ద్ద‌లు: అద‌ర గొట్టిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌

Matthew Wade records the fastest century by an Australian in List A cricket

నార్తాంప్ట‌న్ షైర్‌: ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ మాథ్యూ వేడ్ అద‌ర‌గొడుతున్నాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో ప‌ర్యటిస్తోన్న ఆస్ట్రేలియా-ఎ టీమ్ త‌ర‌ఫున ఆడుతున్న ఈ ఎడ‌మ‌చేతి వాటం బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా సెంచ‌రీలు సాధిస్తున్నాడు. ఈ క్ర‌మంలో- ఫాస్టెస్ట్ సెంచ‌రీని నమోదు చేశాడు. 45 బంతుల్లో వంద ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. 68 బంతుల్లో 150 ప‌రుగుల‌ను పూర్తిచేశాడు. 71 బంతుల్లో 155 ర‌న్స్ సాధించాడు. ఆస్ట్రేలియా లిస్ట్‌-ఎ క్రికెట్ విభాగంలో ఇదే అత్యుత్త‌మ సెంచ‌రీ. ఇంత త‌క్క‌వ బంతుల్లో లిస్ట్‌-ఎలో సెంచ‌రీ చేసిన బ్యాట్స్‌మెన్ మ‌రొక‌రు లేరు.

ఇంగ్లండ్‌లో డెర్బిషైర్‌ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా మాథ్యూ వేడ్ ఈ ఫీట్ సాధించాడు. మెరుపు వేగంతో వేడ్ సాధించిన సెంచ‌రీతో ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బిషైర్ జ‌ట్టు 284 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టు ముందు ఉంచింది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా-ఏ టీమ్ 35.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. మొత్తం 45 బంతుల్లో వంద పరుగులను చేశాడు. సెంచ‌రీ తరువాత కూడా అదే దూకుడును కొన‌సాగించాడు. సెంచ‌రీలో తొలి ఫిఫ్టీని 20 బంతుల్లో ఫినిష్ చేశాడు. రెండో ఫిఫ్టీ కోసం 25 బంతులు తీసుకున్నాడు. మొత్తం 71 బంతుల్లో 14 ఫోర్లు 11 సిక్స‌ర్ల‌తో 155 ప‌రుగులు చేశాడు. ఆస్ట్రేలియా- ఏ బౌల‌ర్ ఆండ్రూ టై 65 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు.

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అతి త‌క్కువ బంతుల్లో సెంచ‌రీని అధిగ‌మించిన రికార్డు ప్ర‌స్తుతం ఏబీ డివిలియ‌ర్స్ పేరు మీద ఉంది. 2015లో వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియ‌ర్స్ 64 బంతుల్లో 150 ప‌రుగులు చేశాడు. రెండో స్థానంలో మాథ్యూ వేడ్ నిలిచాడు. డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో 68 బంతుల్లో 150 ర‌న్స్ చేశాడు. వెస్టిండీస్‌పై 76 బంతుల్లోనే 150 ప‌రుగులు చేసిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ఇదే జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తిక్‌కు కూడా ఈ జాబితాలో చోటు ద‌క్కింది. త‌మిళ‌నాడు జ‌ట్టు త‌ర‌ఫున ఆడిన దినేష్ కార్తీక్ హైద‌రాబాద్‌పై 80 బంతుల్లో 150 ర‌న్స్ చేశాడు.

Story first published: Monday, June 24, 2019, 16:39 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+