For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ‎ఐపీఎల్‌లో ఇప్పటికీ అతడే అత్యంత విలువైన ఆటగాడు: హేడెన్‌

Matthew Hayden says CSK captain MS Dhoni remains the Most Valuable Player in IPL.
IPL 2021 : Matthew Hayden Picks MS Dhoni As The Most Valuable Player Of IPL || Oneindia Telugu

దుబాయ్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఒకప్పటి సీఎస్‌కే ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై కెప్టెన్ ధోనీ అత్యంత విలువైన ఆటగాడన్నాడు. వయసు పై బడుతుంటడంతో ధోనీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నా.. జట్టులో కెప్టెన్‌గా ఎంతో కీలకంగా ఉన్నాడని పేర్కొన్నాడు. మైదానంలో మహీ వ్యూహాలు ఇప్పటికీ ఎంతో పదునుగా ఉంటాయని, అలాగే ఆటగాళ్ల నుంచి ఉత్తమ ఆటను ఎలా తీసుకరావాలో అతడికి బాగా తెలుసని హేడెన్‌ చెప్పాడు. గురువారం సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించడం ద్వారా 18 పాయింట్లతో చెన్నైప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కే ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. మొదటి సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ భుజాన వేసుకున్నాడు. వయసుపైబడిన ఆటగాళ్ల నుంచి కూడా మహీ అత్యుత్తమ ఆటను రాబడుతున్నాడు. డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లే ఇదుకు చక్కని ఉదాహరణ. జట్టు ఎంపికలోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తాడు. ఏ విభాగంలో ఏ ప్లేయర్ కావాలో అతడికి బాగా తెలుసు. ఓ ఆటగాడిపై నమ్మకం ఉంచి గాడిలో పడేవరకు అవకాశాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే మహీ సారథ్యంలో చెన్నై జట్టు ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. మరోసారి టైటిల్ దిశగా అడుగులేస్తోంది.

తాజాగా స్టార్ స్పోర్ట్స్ సూపర్ కింగ్స్ షోలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ మాట్లాడుతూ... 'ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీకి అత్యుత్తమ టోర్నమెంట్లు లేనప్పటికీ.. అతడే అత్యంత విలువైన ఆటగాడు. జట్టుకు ఓ నాయకుడిగా వ్యవహరిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. అతని వయసు పైబడుతోంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ వీటన్నింటికి చెక్ పెడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. డ్వాన్ బ్రావో లాంటి ఆటగాళ్లు టోర్నమెంట్‌పై ప్రభావం చూపుతున్నారు. చెన్నై జట్టు ప్రతి విభాగంలో బాగా రాణిస్తోంది' అని అన్నాడు.

ఐపీఎల్ మొదటిసారి జరిగినప్పుడు ఎంఎస్ ధోనీ బలమైన యువ జట్టును కలిగి ఉన్నాడు. జట్టు ఎంపికలో వ్యూహాలు అమలు చేస్తాడు. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకోవాలో అతడికి తెలుసు. ఇప్పుడు మహీకి సీనియర్ బృందం ఉంది. అతను ఇప్పటికీ డ్వేన్ బ్రావో వంటి సీనియర్ వ్యక్తులను ప్రోత్సహింస్తున్నాడు. ఉదాహరణకు ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, సురేష్ రైనా, అంబటి రాయుడు లాంటి అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. వారందరూ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడుతున్నారు. మహీ శైలి, ఆలోచనలు అద్భుతం, లెజెండ్స్ మాత్రమే అలా ఉంటారు. ధోనీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నా.. జట్టులో కెప్టెన్‌గా ఎంతో కీలకంగా ఉన్నాడు. టోర్నీలో ధోనీ అత్యంత విలువైన ఆటగాడు' అని మాథ్యూ హేడెన్‌ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ 2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కించుకుంది. లీగ్ దశలో ఇంకా చెన్నైకి మూడు మ్యాచులు ఉన్నాయి. రెండు విజయాలు సాధిస్తే.. లీగ్ దశలో టోర్నీలో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా నిలవనుంది. గతేడాది చెన్నై ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించని విషయం తెలిసిందే.

Story first published: Friday, October 1, 2021, 0:15 [IST]
Other articles published on Oct 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+