'బేబి సిట్టర్' యాడ్: సెహ్వాగ్‌కు ట్విట్టర్‌లో వార్నింగ్ ఇచ్చిన హెడెన్ (వీడియో)

హైదరాబాద్: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ప్రముఖంగా వినిపించిన పేరు 'బేబి సిట్టర్'. ఇందుకు కారణం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. టీమిండియా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ పిల్లలకు రిషబ్ పంత్ బేబి సిట్టర్‌గా మారాడు. పంత్ బేబి సిట్టర్‌గా మారిన తీరుపై స్టార్ స్పోర్ట్స్ తాజాగా ఓ యాడ్‌ను రూపొందించింది.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి భారత పర్యటనకు ఆస్ట్రేలియా రానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఈ యాడ్‌ని రూపొందించింది. ఆ యాడ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బేబీసిట్టర్ అవతారం ఎత్తాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ రెండు రోజుల క్రితం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయింది.
మాథ్యూ హేడెన్‌కు గట్టి హెచ్చరిక
అయితే, ఈ వీడియోపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్‌కు గట్టి హెచ్చరిక చేశాడు. ప్రధానంగా ఆస్ట్రేలియా జట్టు జెర్సీలతో యాడ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు.
ఆసీస్ ఏమీ పసికూన కాదు
ఆస్ట్రేలియా ఏమీ పసికూన కాదనే సంగతిని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని అన్నాడు. ఈ మేరకు తన ట్విటర్‌లో స్పందించిన హెడెన్.. యూడ్‌ను రూపొందించిన స్టార్ స్పోర్ట్స్‌తో పాటు యాడ్‌లో నటించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ట్యాగ్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications