Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు వైరల్: మారువేషం, లుంగీలో చెన్నై వీధుల్లో మ్యాథ్యూ హెడెన్

Matthew Hayden Goes Undercover Shopping in Chennai Streets But Fans Arent Buying it

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్‌.. గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో మ్యాథ్యూ హెడెన్ కామెంటేటర్‌గా వ్వవహారిస్తున్నాడు. అయితే, కాసేపు తన కామెంటేటర్ బాధ్యతలను పక్కనపెట్టి చెన్నైలోని టి.నగర్‌లో షాపింగ్‌ చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

47 ఏళ్ల మ్యాథ్యూ హెడెన్ 2008 నుంచి 2010 వరకు మూడు సీజన్లలో చెన్నై తరుపున ఆడాడు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ హెడెన్‌కు చెన్నైతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. తాజాగా తెల్ల లుంగీ, లైట్‌ పింక్‌ కలర్‌ షర్ట్‌ ధరించడంతోపాటు తనను ఎవరూ గుర్తు పట్టకుండా గడ్డం పెట్టుకుని చెన్నై వీధుల్లో తిరిగాడు.

ఇంతకీ హెడెన్ ఈ షాపింగ్ ఎందుకు చేశాడో తెలుసా? ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆయనకు ఓ సవాల్ విసిరాడు. చెన్నైలో రూ.1000లోపు ఉన్న వస్తువులు కొనాలన్నది ఆ చాలెంజ్. దీంతో హేడెన్ వెంటనే టీ నగర్‌కు వెళ్లి అక్కడ వెయ్యిలోపు విలువున్న లుంగీలు, షర్ట్‌లు, వాచ్‌లు కొన్నాడు.

స్థానికంగా ఉండే ఓ యువకుడు అతనికి షాపింగ్ చేయడంలో సాయం చేశాడు. ఓ వాచ్ కోసం హేడెన్ బేరమాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చెన్నై వీధుల్లో షాపింగ్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Thursday, April 4, 2019, 18:21 [IST]
Other articles published on Apr 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+