Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌండరీ వద్ద అథ్లెటిక్‌ విన్యాసాలు.. క్రికెట్‌లో మరో అద్భుతమైన క్యాచ్‌ (వీడియో)

Big Bash Boundary Catch, Out Or Not Out ? || Oneindia Telugu
Matt Renshaw-Tom Banton Relay Catch to Dismiss Mathew Wade During Brisbane Heat vs Hobart Hurricanes Match

బ్రిస్బేన్‌: బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అంటేనే సంచలనాలకు మారు పేరు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ఎప్పుడు ఏదోక సంచలనం నమోదు అవుతూనే ఉంటుంది. ఆటగాళ్లే కాకుండా చివరికి అంపైర్లు కూడా ఏదొకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బీబీఎల్ లీగ్ నిర్వాహకులు కూడా వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అథ్లెటిక్‌ విన్యాసాలు

అథ్లెటిక్‌ విన్యాసాలు

గురువారం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో అద్భుతమైన క్యాచ్‌ నమోదైంది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌, హోబర్ట్‌ హరీకేన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాట్‌ రెన్‌షా బౌండరీ వద్ద అథ్లెటిక్‌ విన్యాసాలు చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన అభిమానులు, అంపైర్లు, ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు.

 అద్భుతమైన క్యాచ్‌

అద్భుతమైన క్యాచ్‌

హరికేన్స్‌ కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (61) అప్పటికే అర్ధ సెంచరీ చేసి మంచి ఊపుమీదున్నాడు. ఇదే ఊపులో బెన్ కటింగ్ వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ లైన్ లోపల పడుతుండగా.. పరుగెత్తుకెళ్లిన మ్యాట్‌ రెన్‌షా బంతిని అందుకున్నాడు. ఆ వెంటనే బ్యాలెన్స్‌ తప్పడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ దాటాడు. బంతి తిరిగి బౌండరీ లోపలే పడబోతుండగా.. రెన్‌షా మళ్లీ గాల్లోకి ఎగిరి బంతి మైదానంలోకి విసిరాడు. అక్కడే ఉన్న మరో ఫీల్డర్‌ (టామ్ బాంటన్) బంతిని అందుకున్నాడు.

 క్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు

క్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు

క్యాచ్ పట్టిన తర్వాత అంపైర్లకు, ఆటగాళ్లకు అది ఔటో లేదా నాటౌటో అర్థంకాక తికమక పడ్డారు. చాలాసార్లు రిప్లైలో చూసిన తర్వాత ఔట్ అని ప్రకటించారు. దీంతో వేడ్‌ పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఈ క్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే క్రికెట్‌ నిబంధన 19.5 ప్రకారం అది ఔట్‌గా తేలింది. ఫీల్డర్‌ తొలిసారి బంతి అందుకున్నప్పుడు మైదానం లోపల ఉండటం, రెండోసారి గాలిలో ఉండటం వల్ల దాన్ని ఔట్‌గా గుర్తించాలని ఉంది.

రెన్‌షాపై ప్రశంసలు

మ్యాట్‌ రెన్‌షా క్యాచ్‌కు సంబందించిన వీడియోలను బీబీఎల్, క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాయి. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు రెన్‌షాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'బౌండరీ వద్ద అథ్లెటిక్‌ విన్యాసాలు' అని కొందరు ట్వీట్ చేయగా.. 'క్రికెట్‌లో మరో అద్భుతమైన క్యాచ్‌' అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.

Story first published: Friday, January 10, 2020, 11:58 [IST]
Other articles published on Jan 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+