అసలేం జరిగింది?: ఆట మధ్యలో కడుపునొప్పి, ఆసీస్ మాజీల విమర్శలు
హైదరాబాద్: పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మ్యాచ్ రెన్ షాలు చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 82 పరుగుల దగ్గర ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కడుపులో తిప్పుతుందంటూ మరో ఓపెనర్ రెన్ షా డ్రస్సెంగ్ రూమ్ వైపు పరుగులు తీశాడు. కాసేపు ఏమి జరుగుతుందో స్టేడియంలో ఉన్నవారికి ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఈ సమయంలో అంపైర్ కేకలేసి రెన్ షాను పిలువగా తనకు కడుపు అప్‌సెట్ అయ్యిందని డ్రస్సింగ్ రూమ్‌కు వెళుతున్నానని చెప్పి వాష్ రూమ్ వైపు పరుగులు తీశాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్లు రెన్ షాను రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటించారు. మ్యాచ్ మధ్యలో రెన్ షా రిటైర్ట్ హర్ట్ అంటూ మధ్యలోనే పెవిలియన్‌కు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెన్ షా తీరుపై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో
మండిపడుతున్నారు. అర్జెంట్‌గా బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చిన రెన్ షా ఏకంగా రిటైర్ట్ హర్ట్ అని వెళ్లిపోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వాష్ రూమ్ కు వెళ్లిన అతడు తిరిగి రాకపోగా మార్ష్ బ్యాటింగ్‌కు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

దీంతో రెన్ షా తీరుపై ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్
మండిపడ్డాడు. ఫాక్స్ స్పోర్ట్స్ కోసం కామెంటరీ ఇస్తున్న బోర్డర్ ఆ సమయంలో రెన్షాపై కాస్త ఘాటుగానే స్పందించాడు. 'ఇది సిగ్గుచేటు. లంచ్‌కు కేవలం 15 నిమిషాల ముందు అతను అలా వెళ్లిపోయాడు. అతను తీవ్రంగా గాయపడి లేవలేని స్థితిలో ఉంటే తప్ప నేను దీనిని అంగీకరించను' అని బోర్డర్ అన్నాడు.
మైకేల్ క్లార్క్ ఏమన్నాడో తెలుసా?
మరో మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా ఇలాంటి విమర్శే చేశాడు. లంచ్‌కు కేవలం 15 నిమిషాల ముందు రెన్షా ఇలా వెళ్లిపోవడం నమ్మలేకపోతున్నా అని క్లార్క్ అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దామియన్ మార్టిన్ సైతం ట్విట్టర్‌లో రెన్‌షాను విమర్శించాడు.
గతంలో కెవిన్ పీటర్సన్ కూడా ఇలానే
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఎడ్ కొవాన్ కూడా ట్విట్టర్‌లో స్పందిస్తూ బ్యాట్, గ్లోవ్స్ మైదానంలో వదిలేసి బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తే సరిపోయేది.. గతంలో కెవిన్ పీటర్సన్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇలాగే చేశాడు అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications