Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెన్రీ, గుప్తిల్ జోరు: కివీస్‌పై శ్రీలంక ఓటమి

క్రిస్ట్‌చర్చ్: బౌలింగులో హెన్రీ, బ్యాటింగ్‌లో మార్టిన్ గుప్తిల్ జోరును ప్రదర్శించడంతో న్యూజిలాండ్‌పై శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. శనివారం జరిగిన తొలి మ్యాచులో శ్రీలంక ఏడు వికెట్ల తేడాదో ఓటమి పాలైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 47 ఓవర్లలో 188 పరుగులకు చేతులెత్తేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో సిరివర్ధనే (66), కులశేఖర (58) అర్థ సెంచరీలు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు కివీస్ బౌలర్లలో హెన్రీ నాలుగు, బ్రాస్ వెల్ మూడు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. మెక్ లారెన్ రెండు, మిల్నీ ఒక వికెట్ పడగొట్టారు.

Matt Henry, Martin Guptill Star as New Zealand Defeat Sri Lanka

శ్రీలంక తమ ముందు ఉంచి 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ వెనుదిరిగి చూడలేదు. ఓపెనర్ గుప్తిల్ (79), మెకల్లమ్ (55) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు శ్రీలంక బౌలింగును చిత్తు చేశారు. జట్టు స్కోరు 108 పరుగులు ఉన్నప్పుడు మెకల్లమ్ అవుటయ్యాడు.

ఆ తర్వతా 162 పరుగుల వద్ద లాథమ్ (18) పెవిలియన్ దారి పట్టాడు. మరో రెండు పరుగులు చేయగానే గుప్తిల్ అవుటైనా అప్పటికే న్యూజిలాండ్ విజయం ఖాయమైంది. చివరలో రాస్ టేలర్, నికోలస్ లాంఛనాన్ని పూర్తి చేశారు. కేవలం 21 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ 191 పరుగులు చేసింది. అంతకు ముందు శ్రీలంక 2-0 స్కోరుతో రెండు టెస్టుల సిరీస్‌నను న్యూజిలాండ్‌పై కోల్పోయింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+