Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ కీపర్ మాథ్యూ వేడ్ తొండాట.. నివ్వెరపోయిన ఇంగ్లాండ్ ప్లేయర్లు..! ఆశ్చర్యకరంగా అంపైర్ల డిసిషన్

wade

ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఆసీస్ తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఆసీస్ హిట్టర్ మాథ్యూ వేడ్, ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ మధ్య జరిగిన ఈ ఘటన సహచర ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లను, ప్రేక్షకులను నివ్వెర పరిచింది. 209పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ధాటిగా పోరాడుతుంది. ఇంకా 22బంతుల్లో 49పరుగులు చేయాల్సిన తరుణం. క్రీజులో వార్నర్, మాథ్యూ వేడ్ ఉన్నారు. ఇక ఆ ఓవర్ మూడో బంతికి వేడ్ హిట్ చేయగా.. బంతి గాల్లోకి లేచింది. వుడ్ దాన్ని అందుకోవడానికి ముందుకు పరిగెత్తాడు. బంతి ఎటు వెళ్లిందో చూసుకోని వేడ్ క్రీజు నుంచి రన్ తీయడానికి పరిగెత్తాడు. అవతలి ఎండ్‌లో ఉన్న వార్నర్ వద్దనడంతో మళ్లీ క్రీజువైపునకు బ్యాక్ అయ్యాడు. ఈ క్రమంలో గాల్లో ఉన్న బంతిని క్యాచ్ అందుకోవడానికి పరిగెత్తుకుంటూ రాగా.. వేడ్ తన లెఫ్టాండ్‌తో అతన్ని అడ్డుకున్నాడు. దీంతో వుడ్ క్యాచ్ మిస్సయ్యింది. వేడ్ క్రీజు వైపు వెళ్లాడు.

ఎందుకు ఔట్ ఇవ్వలేదో అర్థం కాలేదు

వేడ్ ఉద్దేశపూర్వకంగానే వుడ్‌ను అడ్డుకున్నట్లు రిప్లేలో స్పష్టంగా కన్పించింది. ఇక ఈ ఘటనతో ఇంగ్లాండ్ ప్లేయర్లు అవాక్కయ్యారు. ఇక అంపైర్లు దీని మీద డిస్కస్ చేసి.. చివరికి వేడ్‌ను ఔటివ్వకుండానే బ్యాటింగ్ కొనసాగింపజేశారు. అయితే ఫీల్డర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే బ్యాటర్‌ను ఔటివ్వాలని రూల్స్ చెబుతున్నా ఎందుకు ఇవ్వలేదో మాత్రం అర్థం కాలేదు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. వేడ్ తొండాట ఆడాడు అంటూ అతనిపై కామెంట్లు తీవ్రమయ్యాయి. ఇది సరికాదు వేడ్ అంటూ మరికొందరు అతన్ని ఉద్దేశించి పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లాండ్ స్పిరిట్ ఆఫ్ గేమ్ గురించి ఈ విషయంలో మాట్లాడాలి అంటూ మరికొందరు మొన్నటి దీప్తి శర్మ రనౌట్‌పై ఇంగ్లాండ్ చేసిన రాద్ధాంతాన్ని గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు.

బట్లర్, హేల్స్ దంచికొట్టగా.. వార్నర్ పోరాడగా..

ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ ద్వారా పునరాగమనం చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (68పరుగులు 32బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) తన మాస్ ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (84పరుగులు 51బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 208పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఛేదనలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (54 బంతుల్లో 73 పరుగులు 8ఫోర్లు, 2సిక్సర్లు) గట్టి ప్రతిఘటన కనబర్చినప్పటికీ మిగతా వాళ్లలో ఒకరిద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్ మిస్సయింది. దీంతో ఆసీస్ విజయానికి 8పరుగుల దూరంలో ఆగిపోయింది. హేల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చివరి ఓవర్ వరకు ఉత్కంఠ

చివరి ఓవర్ వరకు ఉత్కంఠ

ఆ మ్యాచ్‌లో ఆసీస్ విజయానికి చివరి ఓవర్‌లో 16పరుగులు అవసరమైన దశలో ఫాస్ట్ బౌలర్ సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. మాథ్యూ వేడ్ తొలి బంతికి ఫోర్ కొట్టాడు. దీంతో సమీకరణం 5బంతుల్లో 12గా మారింది. రెండో బంతికి డాట్ బాల్. మూడో బంతికి స్టోక్స్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వేడ్ ఔటవ్వడంతో ఆసీస్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో బంతికి సింగిల్, అయిదో బంతికి నాథన్ ఎల్లిస్ బౌల్డ్ అయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే రావడంతో 8పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3వికెట్లతో ఆకట్టుకోగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లతో రాణించాడు.

Story first published: Monday, October 10, 2022, 7:30 [IST]
Other articles published on Oct 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+