Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కేకేఆర్‌కు బిగ్ షాక్.. రూ.18 కోట్ల ఆటగాడు ఔట్!

IPL 2026: ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే పలువురు కీలక ప్లేయర్లు గాయాల బారిన పడగా.. తాజాగా శ్రీలంక స్టార్ మతీషా పతిరానా కూడా ఈ జాబితాలో చేరడంతో కోల్‌కతా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన మతీషా పతిరానా.. కేవలం 8 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోల్‌కతా జట్టు యాజమాన్యం ఏకంగా రూ.18 కోట్ల భారీ ధర చెల్లించి ఈ లంక బౌలర్‌ను కొనుగోలు చేసింది. అయితే కోట్లు కుమ్మరించి తెచ్చుకున్న ఈ స్టార్ బౌలర్ తొలి మ్యాచ్‌లోనే గాయపడటంతో కేకేఆర్ శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరానా తన కోటా బౌలింగ్‌లో మొదటి 7 బంతులను బాగానే వేశాడు. అయితే ఎనిమిదో బాల్ వేసేందుకు రన్-అప్ తీసుకుంటుండగా ఒక్కసారి ఆగిపోయి ఎడమ కాలి పిక్కలో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో స్టేడియంలోకి వచ్చి చికిత్స అందించారు. ఆ తర్వాత పతిరానా ఒక స్లో బాల్ వేసినప్పటికీ.. నొప్పి తీవ్రత తగ్గకపోవడంతో బౌలింగ్ ఆపేసి స్టేడియం బయటకు వెళ్లిపోయాడు. నిజానికి టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలోనే గాయపడిన పతిరానా.. ఆ టోర్నీలో కేవలం 3 మ్యాచ్‌లే ఆడాడు. ఆ గాయం కారణంగానే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఆడిన పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పతిరానా వస్తే బౌలింగ్ బలోపేతం అవుతుందని ఆశించిన కోల్‌కతాకు ఈ మ్యాచ్ నిరాశనే మిగిల్చింది.

Matheesha Pathirana Injury Blow Rs 18 Crore KKR Pacer Walks Off on Debut vs Gujarat Titans

ఈ సీజన్లో కేకేఆర్ జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే కేకేఆర్ జట్టుకు చెందిన కీలక ఫాస్ట్ బౌలర్లు ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా గాయాల కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ. 18 కోట్ల ప్రధాన బౌలర్ పతిరానా కూడా గాయపడటం జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.

గాయపడిన సాయి సుదర్శన్
ఇదే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా గాయపడ్డాడు. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగి వేసిన ఓ బాల్ సుదర్శన్ ఎడమ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన సాయి సుదర్శన్‌కు ఫిజియోలు మైదానంలోనే ప్రథమ చికిత్స చేశారు. అయినప్పటికీ బ్యాటింగ్ చేయలేక 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుదర్శన్ 'రిటైర్డ్ హర్ట్'గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయిన తర్వాత సుదర్శన్ తిరిగి క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేయడం విశేషం.

కేకేఆర్ బ్యాటర్ల విధ్వంసం
బౌలింగ్‌లో పతిరానా గాయంతో కేకేఆర్ షాక్‌కు గురైనప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ గుజరాత్ బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 35 బంతుల్లోనే 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. అతనితో పాటు అంగ్ క్రిష్ రఘువంశీ (82* పరుగులు), కామెరాన్ గ్రీన్ (52* పరుగులు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 247/2 భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

Story first published: Sunday, May 17, 2026, 8:00 [IST]
Other articles published on May 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+