న్యూఢిల్లీ: ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి జూనియర్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు అమిత్ మిశ్రా. అక్షర పటేల్, జయంత్ యాదవ్ లాంటి జూనియర్ ఆటగాళ్లకు విలువైన సలహాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని లెగ్ స్ఫిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో 18 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డును కూడా మిశ్రా దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సీనియర్ బౌలర్‌గా జూనియర్ ఆటగాళ్లతో నా విజ్ఞానాన్ని పంచుకునే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
మనం ఆటలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిస్తే, మన నుంచి వారు ప్రేరణ పొందడంతో పాటు ఆటలో మనం చెప్పేదాన్ని కూడా అనుసరిస్తారని పేర్కొన్నాడు. తానెప్పుడూ ప్రత్యర్ధిని కట్టడి చేయడం కన్నా వికెట్లు తీయడానికే ప్రాధాన్యమిస్తానని తెలిపాడు.

'న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నేను వికెట్ల మీదే దృష్టిపెట్టా. పరిస్థితులకు తగినట్లుగా బౌలింగ్ చేశాను. కానీ నా ఉద్దేశం మాత్రం వికెట్లు పడగొట్టడమే. ప్రత్యర్ధి జట్టుని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే బ్యాట్స్‌మెన్ చేతిలో దెబ్బతింటాం'' అని మిశ్రా బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ సిరిస్‌లో ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే వల్లే తాను మెరుగ్గా రాణించగలిగానని మిశ్రా అభిప్రాయపడ్డాడు. విశాఖలో జరిగిన చివరి వన్డేలో ఐదు వికెట్లు తీసుకున్న మిశ్రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ కుంబ్లే తనకు అండగా నిలబడడం వల్లే తానేంటో నిరూపించుకున్నానని తెలిపాడు.
వన్డే క్రికెట్‌లో అమిత్ మిశ్రా గతంలో కూడా సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ విశ్రాంతి తీసుకోవడంతో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న మిశ్రా తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలో టాప్ బౌలర్‌గా నిలిచాడు.