పియర్: ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం నాడు యూఏఈతో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపియర్‌లో గ్రూప్ బిలో భాగంగా వెస్టిండీస్, యూఏఈ తలపడ్డాయి. నిర్ణీత యాభై ఓవర్లు కూడా ఆడకుండా 47.4 ఓవర్లలో అవుటై యూఏఈ 175 పరుగులు చేసింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 30.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. తద్వారా ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జాన్సన్ చార్లెస్ (70 బంతుల్లో 55 పరుగులు), కార్టర్ (102 బంతుల్లో 50 పరుగులు), రామ్ దిన్ (55 బంతుల్లో 33 పరుగులు) చేశారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టులో ఓపెనర్లు విఫలమయ్యారు. అమ్జద్ జావెద్ (56), నాసిర్ అజిజ్ (60) పరుగులు చేశారు. మిగతా వారిలో నవీద్ (14) మినహా ఎవరు కూడా రెండంకెల స్కోర్ అందుకోలేకపోయారు. దీంతో 47.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆది నుండి ఆచితూచి ఆడింది. దీంతో 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు...
గ్రూప్ ఏలో క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లలో.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బిలో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఉన్నాయి. ఆదివారం నాటి మ్యాచులో ఐర్లాండ్ పైన పాకిస్తాన్ గెలుపొంది క్వార్టర్లోకి దూసుకెళ్లింది. రన్ రేట్ మెరుగ్గా ఉండటం వల్ల వెస్టిండీస్ కూడా క్వార్టర్లో ప్రవేశించింది.