Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐర్లాండ్‌పై పాక్ విజయం: క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరితో ఎవరు, ఎక్కడెక్కడ..?

అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా అడిలైడ్‌లో పాకిస్ధాన్ Vs ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్ధాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్ధాన్ ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్స్ లో బెర్తు ఖరారు చేసుకుంది. 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్ధాన్ 46.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాకిస్ధాన్ ఓపెనర్ సర్ఫరాజ్ సెంచరీ పాకిస్ధాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

దీంతో క్వార్టర్ ఫైనల్స్‌లోకి పాకిస్ధాన్ అర్హత సాధించింది. పాక్ ఈ మ్యాచ్‌లో గెలవడంతో ఐర్లాండ్ ఇంటి దారి పట్టనుంది. మెరుగైన రన్ రేట్‌ను కలిగి ఉన్న వెస్టిండిస్ క్వార్టర్స్‌లో అడుగుపెడుతుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుండి న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్టేలియా, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.

ఇక గ్రూప్ బి నుండి భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, పాకిస్ధాన్ జట్లు అర్హత సాధించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో అత్యధికంగా ఫోర్డర్ ఫీల్డ్ సెంచరీ (107) చేశాడు. 131 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.

ఆ తర్వాత విల్సన్ 29, మూనీ 13, బ్రెయిన్ 12, థాంప్సన్ 12 పరుగులు చేశారు. ఇక పాకిస్ధాన్ బౌలర్స్‌లో వాహబ్ రియాజ్ 3, రహత్ ఆలీ, సోహైల్ ఖాన్ చెరో 2 వికెట్లు తీసుకోగా... హరీష్ సోహేల్, అడిల్ చెరో వికెట్ తీసుకున్నారు.

Match Report: Ireland all out for 237 runs after Porterfield's ton

క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్:

పూల్ ఏ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు: న్యూజిలాండ్, ఆస్టేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక

పూల్ బి నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు: ఇండియా, దక్షిణాఫ్రికా వెస్టిండిస్, పాకిస్ధాన్

క్వార్టర్ ఫైనల్ 1 - మార్చి 18 (బుధవారం) - శ్రీలంక Vs దక్షిణాఫ్రికా - సిడ్నీ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 1 - మార్చి 19 (గురువారం) - బంగ్లాదేశ్ Vs భారత్ - మెల్‌బోర్న్ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 3 - మార్చి 20 (శుక్రవారం) - ఆస్టేలియా Vs పాకిస్ధాన్ - అడిలైడ్ ( ఉదయం 9 గంటలకు )

క్వార్టర్ ఫైనల్ 4 - మార్చి 21 (శనివారం) - న్యూజిలాండ్ Vs వెస్టిండిస్ - వెల్లింగ్టన్ ( ఉదయం 6.30 గంటలకు )

సెమీ పైనల్స్ 1 - మార్చి 24 (ఆక్లాండ్)

సెమీ పైనల్స్ 2 - మార్చి 26 (సిడ్నీ)

మార్చి 29 - ఫైనల్ (మెల్ బోర్న్)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+