అతిపెద్ద నో బాల్: మ్యాచ్ ఫిక్సింగ్ లేదా స్పాట్ ఫిక్సింగ్, విచారణకు ఆదేశించిన బోర్డు

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బంగ్లా ప్రీమియర్ లీగ్(బీపీఎల్) ఓ బౌలర్ బౌలింగ్ చేసిన తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. వెస్టిండీస్‌కు చెందిన 34 ఏళ్ల ఎడమ చేతి మీడియం పేసర్ క్రిష్‌మర్ సంతోకి ఈ లీగ్‌లో సిలెట్ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
టోర్నీలో భాగంగా శుక్రవారం రాజ్‌షాహీ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంతోకి వేసిన బంతులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అతడు ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ లెగ్‌సైడ్‌కు అత్యంత దూరంగా ఫుల్‌టాస్ వేశాడు. టెస్టుల్లో అయితే ఆ బంతని వైడ్‌గా ప్రకటించేవాఢు.

డైవ్ కొట్టి మరీ
అలాంటి బంతిని వికెట్ కీపర్ మహ్మద్ మిథున్ డైవ్ కొట్టి మరీ ఆపడం విశేషం. దీంతో క్రిష్‌మర్ వేసిన నోబాల్‌ను చూసి అందరూ అవాక్కయ్యారు. అతడి కుడికాలు క్రీజ్‌కు చాలా దూరంగా పడటంతో నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్‌పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరామని సిలెట్ థండర్ డైరెక్టర్ తంజిల్ చౌధురి వెల్లడించాడు.

నో బాల్ లేదా వైడ్‌పై విచారణ
"నో బాల్ లేదా వైడ్‌పై విచారణకు ఆదేశించాం. మొత్తంగా మాకు బరిలోకి దిగే ఎలెవన్ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్‌మెంట్, కోచ్ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్ చేసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డడా? అనే అనుమానం ఉంది" అని అన్నాడు.

ఎవరి ప్రమేయమైనా ఉందా?
సంతోకి ఇలా నో బాల్ వేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందా? అనే విషయంపై దర్యాప్తు చేస్తామని తంజిల్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో సిలెట్ థండర్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications