మ్యాచ్ ఫిక్సింగ్ హత్య కంటే పెద్దది!: 'రోర్ ఆఫ్ ది లయన్'లో ధోని


హైదరాబాద్: హత్య కంటే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద నేరమని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌తో రెండేళ్లు నిషేధం ఎదుర్కొని గత ఏడాది ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గురించి తీసిన ''రోర్ ఆఫ్ ది లయన్'' డాక్యుమెంటరీలో ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు.

45 సెకన్ల ట్రైలర్‌లో
‘రోర్ ఆఫ్ లయన్స్' పేరిట చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనంపై 45 సెకన్ల ట్రైలర్‌ను నిర్మించారు. ఇందులో "నా దృష్టిలో హత్య కంటే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్ద నేరం. జట్టును అనుమానించారు. నాపైనా ఆరోపణలు చేశారు. కఠిన శిక్ష విధించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ అది కష్టకాలం" అని ధోని అన్నాడు.
మేం టైటిల్ గెలిచాం
"మాపై విధించిన రెండేండ్ల శిక్ష చాలా పెద్దది. తిరిగి ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన క్షణాలు భావోద్వేగాన్ని కలిగించాయి. అభిమానులు మాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే మేం టైటిల్ గెలిచాం. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. కఠినమైన సంఘటనలే మనల్ని మరింత బలంగా తయారుచేస్తాయని నా నమ్మకం" అని ధోని ట్రైలర్‌లో ధోని చెప్పాడు.

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
2013 సీజన్‌లో జట్టు యాజమాన్యం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2015లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కూడా రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications