ఏం జరుగుతుందో?: దిక్కుతోచని స్థితిలో కోహ్లీ, శాస్త్రి
హైదరాబాద్: శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0తో ముందంజలో ఉంది. లంకపై తొలి టెస్టు గెలిచిన ఆనందం కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రికి ఎక్కువ సేపు నిలవలేదు. వీరిద్దరికీ ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.
రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ జ్వరం కారణంగా గాలే టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో అభినవ్ ముకుంద్.... ధావన్‌తో కలిసి బరిలోకి దిగాడు. ధావన్ తన మార్క్ షాట్లతో అలరిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసిన ముకుంద్
అభినవ్ ముకుంద్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ... రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నుంచి సహకారం లభించకున్నా ముకుంద్ 81 పరుగులు చేశాడు. ఇక పుజారా, కోహ్లీ సెంచరీలతో చెలరేగారు. రహానే కూడా నిలకడ ఆడుతుండటంతో టాప్-4 బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రావడం జట్టుకి వరంగా మారింది.

రెండో టెస్టు మ్యాచ్‌కి ఓపెనర్లుగా ఎవరిని ఎంచుకోవాలో
దీంతో ఆగస్టు 3 నుంచి కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కి ఓపెనర్లుగా ఎవరిని ఎంచుకోవాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి. జ్వరం నుంచి కోలుకొని ఓపెనర్ లోకేశ్ రాహుల్ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో ముకుంద్, ధావన్‌లలో ఎవరో ఒకరికే అవకాశం దక్కనుంది.

నలుగురు ఓపెనర్లు మంచి జోరుమీదున్నారు
తొలి టెస్టు విజయం తర్వాత మీడియా సమావేశంలోనూ కోహ్లీ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'ఇదో క్లిష్టమైన సమస్య. ఇప్పుడు నలుగురు ఓపెనర్లు మంచి జోరుమీదున్నారు. ధావన్ మెల్‌బోర్న్ పోదామనుకున్నాడు. కానీ 190 బాదాడు. జీవితంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇదో తలనొప్పి వ్యవహారమే అయినా మంచి నిర్ణయమే తీసుకుంటాం. మిగతా వాళ్లు పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ముగ్గురు నలుగురు ఓపెనర్లు ఉన్నా ఇద్దరికే కదా అవకాశం' అని కోహ్లీ చెప్పాడు.

కేఎల్ రాహుల్‌కే అవకాశం
మరోవైపు అశ్విన్, జడేజా ప్రదర్శనపై కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకోవడంతో ప్రత్యర్థులు పదేపదే తప్పులు చేశారని అన్నాడు. ఏదేమైనప్పటికీ రాహుల్ కోసం ముకుంద్‌ను తప్పించడం ఖాయమే అనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications