న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌లోనే ఇదే అద్భుతమైన క్యాచ్ (వీడియో)

Mashrafe Mortazas stunning catch to dismiss Shoaib Malik

న్యూ ఢిల్లీ: ఎన్నో అంచనాలతో దాయాదుల మధ్య హోరాహోరీ పోరు సంకల్పంతో బరిలోకి దిగిన జట్లన్నీ కొలిక్కి వచ్చేశాయి. బంగ్లాదేశ్, భారత్ మినహాయించి అన్నీ జట్లు చాపచుట్టేశాయి. శుక్రవారం జరగనున్న ఆసియాకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడి టోర్నీ విజేత ఎవరో తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌-పాకిస్తాన్‌లు ఫైనల్ అర్హత సాధించేందుకు హోరాహోరీగా తలపడ్డాయి.

టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసిన ధావన్టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసిన ధావన్

అంతటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఎట్టకేలకు బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ తడబడింది. 18 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ ఆచితూచి ఆడి..(30) 51 బంతుల్లో 2ఫోర్లతో నిలిచాడు. క్రీజులో నిలదొక్కుకొని ప్రమాదకరంగా మారిన మాలిక్‌ను బంగ్లా కెప్టెన్ మొర్తజా ఓ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌ పంపించాడు.

బహుశా నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ క్యాచ్‌ను ఆసియాకప్‌ 2018లోనే అత్యద్భుత క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఇన్నింగ్స్‌ 20.1వ బంతిని మాలిక్‌ మిడ్‌వికెట్‌ మీదుగా ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని మొర్తజా గాల్లోకి డైవ్‌ చేసి అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో పాక్‌ కీలక వికెట్‌ చేజార్చుకుంది. ఛేదనలో ఇదే కీలక మలుపు కావడం గమనార్హం.

ఫైనల్‌లో ఆడేందుకు టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ ఇంతకుముందు మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు ఫైనల్ మ్యాచ్‌లో కనిపించనున్నారు. ఆఖరి మ్యాచ్‌లో పసికూనగా భావించి అఫ్గనిస్తాన్‌తో తలపడిన భారత్‌కు సంతృప్తి లభించలేదు. చేధనకు దిగిన టీమిండియా 252 పరుగుల వద్ద ఒక్క బంతి మిగిలి ఉండగానే ఆలౌట్ ‌కు గురి అయింది. ఈ స్కోరుతో భారత్ మ్యాచ్‌ను టైగా ముగించింది. ఈ మ్యాచ్‌కు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇది అతనికి కెప్టెన్‌గా 200వ వన్డే.

Story first published: Friday, September 28, 2018, 12:21 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X