Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: కివీస్ జట్టుకు మరో షాక్.. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి టాప్ ప్లేయర్ విడుదల

martin guptill opt out of newzealand central contract

న్యూజిల్యాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ను రిలీజ్ చేసినట్లు కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇటీవలే కివీస్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, కాలిన్ డి గ్రాండ్‌హోం కూడా తప్పుకున్నారు. వారి బాటలోనే మార్టిన్ గప్తిల్ కూడా తప్పుకోవడం కచ్చితంగా ఈ జట్టుకు ఎదురు దెబ్బనే అని అంటున్నారు అభిమానులు. పొట్టి ఫార్మాట్‌లో న్యూజిల్యాండ్ జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్న గప్తిల్‌ను కొంతకాలంగా జట్టుకు ఎంపిక చేయడం లేదన్న సంగతి తెలిసిందే.

బౌల్ట్‌తో మొదలు..

బౌల్ట్‌తో మొదలు..

ఇటీవలే కుటుంబంతో సమయం గడపడం కష్టం అవుతుందని చెప్పి ట్రెంట్ బౌల్ట్.. న్యూజిల్యాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు. అతని బాటలోనే కోలిన్ డి గ్రాండ్‌హోం కూడా నడిచాడు. ఈ కారణంగానే భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బౌల్ట్ ఆడలేదు. గ్రాండ్ హోం కూడా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇదే కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనుకుంటుంటే.. స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు మరింత పెద్ద సమస్యగా మారనుంది.

టీ20 ఫార్మాట్‌లో లెజెండ్..

టీ20 ఫార్మాట్‌లో లెజెండ్..

పొట్టి ఫార్మాట్‌లో మార్టిన్ గప్తిల్ చాలా ప్రమాదకరమైన బ్యాటర్. న్యూజిల్యాండ్‌కు ఎన్నో అద్భుతమైన ఓపెనింగ్‌లు అందించాడు. కొన్నిరోజుల క్రితం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యథిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానం కోసం పోటీ పడ్డాడు గప్తిల్. అయితే కొంత కాలంగా అతన్ని జట్టులోకి తీసుకోవడం లేదు. టీ20 వరల్డ్ కప్‌లో కూడా గప్తిల్ ఆడలేదు. తాజాగా భారత్‌తో టీ20 సిరీస్‌లో కూడా అతన్ని ఎంపిక చేయలేదు. ఇలాంటి సమయంలో అతను ఇలా సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఫిన్ అలెన్ రాకతో..

ఫిన్ అలెన్ రాకతో..

కివీస్ జట్టులో విధ్వంసకర ఓపెనర్‌గా యువ ప్లేయర్ ఫిన్ అలెన్ అదరగొడుతున్నాడు. దీంతో గప్తిల్ స్థానం ప్రమాదంలో పడింది. ఈ క్రమంలోనే గప్తిల్‌ను పక్కన పెట్టి అలెన్‌ను ఎంపిక చేస్తున్నారు. దీంతో జట్టు ప్రయోజనాల కోసమే గప్తిల్ ఇలా సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడని న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీనిపై మాట్లాడుతూ.. 'దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. నాకు ఇంతకాలం మద్దతు ఇచ్చిన జట్టు, క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అందుబాటులో ఉండే ఆప్షన్ల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. న్యూజిల్యాండ్‌కు ఆడేందుకు రెడీగానే ఉంటా. అదే సమయంలో మిగతా అవకాశాలను కూడా ప్రయత్నించాలని అనుకుంటున్నా. అలాగే నా కుటుంబంతో కూడా ఎక్కువ కాలం గడపాలని నిర్ణయించుకున్నా' అని చెప్పాడు.

Story first published: Wednesday, November 23, 2022, 14:30 [IST]
Other articles published on Nov 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+