హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా అదే స్ధాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా సెహ్వాగ్ తన ట్విట్టర్ లో ఓ అద్భుతమైన సందేశాన్ని పోస్టు చేశాడు.
మ్యారేజి వర్క్ షాప్‌లాంటిది అంటూ కితాబిచ్చాడు.. ఈ బంధంలో భర్త వర్క్ చేస్తే, భార్య షాపింగ్ చేస్తుంది. కానీ, తన భార్య ఆర్తీ అహల్వత్ వర్క్ చేస్తూ షాపింగ్ చేస్తుంది అంటూ ట్విట్టర్‌లో సెహ్వాగ్ పోస్టు చేశాడు. బీవీజీ(తన భార్యామణి) రాక్స్ అంటూ మాజీ ఓపెనర్ సెహ్వాగ్ చమత్కరించాడు.
ఇదిలా ఉంటే ఇటీవలే టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సెహ్వాగ్ తనదైశ శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు భువనేశ్వర్ బౌలింగ్‌లో గొప్పదనాన్ని భార్యల మూడ్‌తో పోల్చుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
భార్య మూడ్ ఎలా మారిపోతుందో తెలుసుకోవడం భర్తకు ఎంత కష్టమో.. అచ్చంగా అలాగే భువీ ఇన్ స్వింగర్లు, ఔట్ స్వింగర్లను గొప్ప బ్యాట్స్‌మన్ గ్రహించడం అసాధ్యమని ట్వీట్టర్‌లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే భువీ అని రాసుకొచ్చి ట్విట్టర్ వేదికగా భువనేశ్వర్ కుమార్‌కి బర్త్‌డే విషెస్ చెప్పాడు.