Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUSvsSA: మెరుపులా క్యాచ్ పట్టిన ఫీల్డర్.. బ్యాటర్ కూడా నమ్మలేకపోయాడు!

Marnus labushagne takes a stunning catch in AUSvsSA test

కొంతమంది ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదులుతారు. మెరుపులా దూకి అద్భుతమైన క్యాచులు పట్టేస్తారు. అలాంటి క్యాచులు చూసిన ప్రేక్షకులు సీట్లలో ప్రశాంతంగా కూర్చోలేరు. తాజాగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది.

స్కాట్ బోలండ్ బౌలింగ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ఎర్వీ పెవిలియన్ చేరాడు. ఇలా వికెట్ కోల్పోయినా కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించుకున్న సౌతాఫ్రికా 56/1తో మంచి స్కోరు చేసే దిశగా ముందుకు సాగింది. ఇలాంటి సమయంలో మూడు ఓవర్ల వ్యవధిలో సౌతాఫ్రికా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. వాటిలో ప్రధానంగా సఫారీ సారధి డీన్ ఎల్గార్ వికెట్ కోల్పోవడం ఆ జట్టును గట్టిగా దెబ్బకొట్టింది. మెరుపు ఫీల్డింగ్‌తోపాటు డైరెక్ట్ త్రో విసిరిన లబుషేన్.. ఎల్గార్‌ను అవుట్ చేశాడు.

ఆ తర్వాత రెండో సెషన్‌లో కూడా మరోసారి లబుషేన్.. సౌతాఫ్రికా జట్టును దెబ్బతీశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో సఫారీ బ్యాటర్ జోండో కవర్ డ్రైవ్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్ పక్క నుంచి బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే తన ఎడమ వైపు నుంచి వెళ్తున్న బంతి మీదకు చిరుతలా దూకిన లబుషేన్.. చటుక్కున క్యాచ్ పట్టేశాడు. అతను ఆ క్యాచ్ అందుకోవడం చూసి జోండో కూడా షాకైపోయాడు. ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు.

మైదానంలో ప్రేక్షకులు కూడా లబుషేన్ ఫీల్డింగ్ చూసి ఉర్రూతలూగారు. అతని పేరు పిలుస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఆ తర్వాత వచ్చిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు 189 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా ఒక వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది.

Story first published: Monday, December 26, 2022, 13:59 [IST]
Other articles published on Dec 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+