
2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టులో భాగం కావాలనేదే తన టార్గెట్ అని ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ అన్నాడు. 50ఓవర్ల ఫార్మాట్‌లో తాను ఇంకా రెగ్యులర్‌గా చోటు దక్కించుకోలేదని అంగీకరించాడు. 28ఏళ్ల లబుషేన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అధ్వానంగా ఆడాడు. నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన లబుషేన్ ఐదు మ్యాచ్‌లలో 24, 18, 29, 14, 31పరుగులు మాత్రమే చేయగలిగాడు. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
'ఆస్ట్రేలియా జట్టుగా మేము సరైన కూర్పును ఎంచుకోవడానికి కృషి చేస్తున్నాం. అందుకు సరైన కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నాం. నేను కూడా వరల్డ్ కప్ ఆసీస్ టీంలో భాగం కావాలని ఎదురుచూస్తున్నాను' అని లబుషేన్ క్రికెట్.కమ్.ఏయూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 'ఎప్పుడైనా జట్టులో మీ స్థానాన్ని నిలబెట్టుకోగలరని నేను అనుకోను. నేను వన్డే క్రికెట్‌లో కోరుకున్నంతగా రాణించలేకపోయాను. నేను ఒక స్థానం కిందకు పడిపోయాను. మేము వన్డే క్రికెట్ కూడా ఎక్కువగా ఆడలేదు. టీ20 ఫార్మాట్‌కు, టెస్ట్ క్రికెట్‌కు మధ్య చాలా భిన్నమైంది వన్డే ఫార్మాట్. వన్డేకు అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది.' అని లబుషేన్ అన్నాడు.
ఇక 2020లో వన్డేల్లో అరంగేట్రం చేసిన లబుషేన్ ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అతను 85.80 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో సహా 677పరుగులు చేశాడు.