న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టెస్టులో లబుషేన్ డబుల్ సెంచరీ: అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియ‌న్‌గా రికార్డు

Marnus Labuschagne starts the decade with maiden double century

హైదరాబాద్: మార్న‌స్ ల‌బుషేన్ సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. సిడ్నీలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొలి రోజు ఆటలో సెంచరీతో అజేయంగా నిలిచిన లబుషేన్‌ రెండో రోజు ఆటలో డబుల్ సెంచరీతో మెరిశాడు. 130 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన లబుషేన్‌ డబుల్ సెంచరీ సాధిచాడు.

346 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 215 ప‌రుగుల వద్ద టాడ్ ఆస్టల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టెస్టుల్లో లబుషేన్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ. గతేడాది వరుసగా మూడు టెస్టు సెంచరీలు సాధించడంతో పాటు ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా లబుషేన్ నిలిచిన సంగతి తెలిసిందే.

కొత్త సంవత్సరంలో అదే ఫామ్

అదే ఫామ్‌ను కొత్త సంవత్సరంలో కూడా కొనసాగిస్తున్నాడు. 283/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజైన శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో ఐదు పరుగులు జోడించిన తర్వాత మాథ్యవేడ్‌(22) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌తో కలిసి లబుషేన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

జట్టు స్కోరు 331 పరుగుల వద్ద

జట్టు స్కోరు 331 పరుగుల వద్ద

జట్టు స్కోరు 331 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్‌(10) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత లబుషేన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ ఏడాది టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా లబుషేన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. లబుషేన్‌తో కలిసి 79 పరుగులు జత చేసిన తర్వాత పైన్‌(35) ఔటయ్యాడు.

డబుల్ సెంచరీ తర్వాత

డబుల్ సెంచరీ తర్వాత

డబుల్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో లబుషేన్(215) ఆస్టల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, ఈ క్రమంలో లబుషేన్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది. ఐదు టెస్టుల సిరీస్‌లో స‌గ‌టున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియ‌న్‌గా ల‌బుషేన్ నిలిచాడు. ల‌బుషేన్ 837 పరుగులు చేయ‌గా, మాజీ ప్లేయ‌ర్లు నీల్ హార్వే 834, బ్రాడ్‌మాన్ రెండు సార్లు 810, 806 పరుగులు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 454 ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 454 ఆలౌట్

ఇక, టెస్టుల్లో లబుషేన్ బ్యాటింగ్ యావరేజి 63.63గా నమోదైంది. లబుషేన్ ఔటైన తర్వాత చివర్లో మిచెల్‌ స్టార్క్‌(22) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆస్ట్రేలియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 454 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

Story first published: Saturday, January 4, 2020, 12:05 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X