Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముగిసిన తొలిరోజు ఆట.. లబూషేన్‌ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఆసీస్‌!!

Marnus Labuschagne century leads Australia to 283-3

సిడ్నీ: న్యూజిలాండ్‌పై ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి మంచి ఊపులో ఉన్న ఆస్ట్రేలియా అదే జోరును చివరిదైన మూడో టెస్టులో కూడా కనబరుచుతోంది. మూడో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్‌ 90 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్‌ లబూషేన్‌ (130), మాథ్యూ వేడ్ (22) ఉన్నారు. వికీస్ బౌలర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌ రెండు వికెట్లు తీసాడు. ఈ టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

మూడో టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌- జో బర్న్స్‌లు ఆరంభించారు. బర్న్స్‌ (18) నిరాశపరచగా.. వార్నర్‌ మాత్రం 45 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వార్నర్ ఔట్ అనంతరం లబూషేన్‌-స్టీవ్‌ స్మిత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఒకవైపు స్మిత్‌ హాఫ్‌ డిఫెన్స్ చేయగా.. లబూషేన్‌ పరుగులు సాధించాడు. క్రీజులో పాతుకుపోయిన స్మిత్‌.. తొలి పరుగు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు.

వేగం పెంచిన స్మిత్ హాఫ్ సెంచరీ సాధించగా.. లబూషేన్‌ సెంచరీ సాధించాడు. గ్రాండ్‌హోమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 72 ఓవర్‌ మూడో బంతికి ఫోర్‌ కొట్టడంతో లబూషేన్‌ సెంచరీ పూర్తయ్యింది. స్మిత్ పెవిలియన్ చేరినా లబూషేన్‌ మాత్రం కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. వేడ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ జోడి 41 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

స్మిత్‌.. తొలి పరుగు చేయడానికి 39 బంతులు ఆడాడు. అంతేకాదు 45 నిమిషాల తర్వాత పరుగు చేసాడు. అన్ని బంతులు ఆడి సింగిల్‌ తీసిన స్మిత్‌ను ఆసీస్ అభిమానులు ఆకాశానికెత్తారు. సిడ్నీ స్టేడియంలోని అభిమానులు లేచి మరీ స్మిత్‌ను చప్పట్లతో అభినందించారు. ఒక బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేసిన తర్వాత అభిమానుల అభినందించడం సాధారణం. కానీ ఇక్కడ ఆసీస్‌ అభిమానులు మాత్రం పరుగు తీసిన తర్వాత అతన్ని చప్పట్లతో అభినందించడం విశేషం.

2019లో 1,104 టెస్టు పరుగులు సాధించిన లబూషేన్‌.. ఆ ఏడాది వెయ్యి పరుగులు చేరిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదిని కూడా ఘనంగా ఆరంభించాడు. తొలి రోజు ఆటలో లబూషేన్‌ శతకం చేయడంతో.. 2020లో తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Story first published: Friday, January 3, 2020, 16:23 [IST]
Other articles published on Jan 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+