Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో సిరీస్‌: లబుషేన్‌కు చోటు.. ఆస్ట్రేలియా జట్టు ఇదే!!

Marnus Labuschagne Called Up As Australia ODI Squad For India Tour

సిడ్నీ: భారత్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. డిసెంబర్ 22తో ఈ సిరీస్ ముగియనుంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. మంగళవారం ఈ పర్యటనకు 14 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది.

భారీ మార్పులు:

భారీ మార్పులు:

భారత పర్యటన కోసం ఆసీస్ జట్టులో భారీ మార్పులు చేసింది. టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న మార్నస్‌ లబుషేన్‌కు వన్డే జట్టులో సీఏ అవకాశం ఇచ్చింది. దీంతో లబుషేన్‌ తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది టెస్ట్ క్యాప్ సంపాదించినప్పటి నుండి లబుషేన్‌ 58.05 సగటున పరుగులు చేసాడు. ఇక చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించాడు.

స్టార్ ఆటగాళ్లు దూరం:

స్టార్ ఆటగాళ్లు దూరం:

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ఉస్మాన్‌ ఖవాజా, షాన్‌ మార్ష్‌, కౌల్టర్‌ నైల్, మార్కస్ స్టొయినిస్‌, నాథన్‌ లయాన్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌లకు జట్టులో చోటు దక్కలేదు. పేసర్ బెరెన్‌డార్ఫ్‌ గాయంతో దూరమయ్యాడు. ఆల్‌రౌండర్‌ సీన్ అబోట్ ఐదేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ అష్టన్ అగర్ మరో అవకాశం దక్కించుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్‌కు చోటు దక్కింది.

టర్నర్‌ భారత్‌లో రాణించగలడు:

టర్నర్‌ భారత్‌లో రాణించగలడు:

చీఫ్‌ సెలక్టర్‌ ట్రెవర్‌ హోన్స్‌ మాట్లాడుతూ... 'లబుషేన్ వైట్‌ బాల్‌ క్రికెట్‌లో కూడా రాణించగలడని నమ్ముతున్నాం. టీ20 పవర్ హిట్టర్ ఆస్టన్‌ టర్నర్‌ భారత్‌లో రాణించగలడు. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని సత్తా చాటుతాడు. మాక్స్‌వెల్ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది' అని అన్నాడు.

 జనవరి 14న తొలి వన్డే:

జనవరి 14న తొలి వన్డే:

భారత పర్యటనలో ఆసీస్‌ హెడ్ కోచ్‌గా సీనియర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మెక్‌ డొనాల్డ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ పర్యటన జనవరి 14న మొదలై.. 19తో ముగుస్తుంది. జనవరి 14న తొలి వన్డే (ముంబై), 17న రెండో వన్డే (రాజ్‌కోట్‌), 19న మూడో వన్డే (బెంగళూరు)లో జరగనుంది. త్వరలో భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించనుంది.

ఆసీస్‌ జట్టు:

ఆసీస్‌ జట్టు:

ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్, అబాట్‌, ఆస్టన్‌ అగర్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమిన్స్‌, హ్యాండ్స్‌కాంబ్‌, హేజిల్‌వుడ్‌, మార్నస్‌ లబుషేన్‌, కేన్‌ రిచర్డ్సన్‌, మిచెల్ స్టార్క్‌, ఆస్టన్‌ టర్నర్‌, ఆడమ్‌ జంపా.

Story first published: Tuesday, December 17, 2019, 13:05 [IST]
Other articles published on Dec 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+