Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఎవరో తెలుసా?

Marnus Labuschagne becomes first concussion substitute in Test history

హైదరాబాద్: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లాబస్‌చేంజ్‌ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ మెడను బలంగా తాకడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

92 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ఔట్

అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా స్టీవ్ స్మిత్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఒక క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసింది.

సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఐసీసీ ఈ కొత్త నిబంధనల మేరకు ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా అందుకు మ్యాచ్ రిఫరీ అంగీకరించాడు. స్మిత్ స్మిత్ స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లాబస్‌చేంజ్‌ మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ అరుదైన ఘనత సాధించాడు.

సవరించిన నిబంధనల ప్రకారం

సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. జట్టు వైద్యుడు రిచర్డ్స్ అంగీకారంతో గాయంతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ కొరకు మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.

సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ అరుదైన ఘనత

తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ అరుదైన ఘనత సాధించాడని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ట్వీట్ చేసింది. "యాషెస్‌ రెండో టెస్టు నుంచి స్టీవ్ స్మిత్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ బరిలోకి దిగాడు" అని ఐసీసీ తన ట్వీట్‌లో పేర్కొంది. యాషెస్‌ రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, August 19, 2019, 11:55 [IST]
Other articles published on Aug 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+