కోహ్లీ, కేన్, స్మిత్‌ల మాదిరి మల్టీ ఫార్మాట్ మాస్టర్ కావాలన్నదే లక్ష్యం: లబుషేన్

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాలైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్‌స్మిత్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ల మాదిరి అన్ని ఫార్మాట్లలో రాణించేందుకు భారత పర్యటన ఓ మంచి అవకాశమని ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అన్నాడు.
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ మాస్టర్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. మూడు వన్డేల పర్యటన కోసం ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు త్వరలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో మార్నస్ లబుషేన్‌కు కూడా చోటు దక్కించుకున్నాడు.

లబుషేన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ పర్యటన
మార్నస్ లబుషేన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ పర్యటన. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్యూలో లబుషేన్ మాట్లాడుతూ "స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాను. సుదీర్ఘ కాలంగా వారు ఒకటి కన్నా ఎక్కువ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నారు" అని అన్నాడు.

ఈ వేసవిలో విజయవంతం అయ్యాను
"ఈ వేసవిలో నేను విజయవంతం అయ్యాను. ఇకపై మరింత నిలకడగా ఆడటమే నా ముందున్న సవాల్. వన్డేల్లో చోటు దక్కించుకోవడం ఉత్సాహం కలిగించింది. భారత పర్యటన ఓ సవాల్. ఉపఖండంలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. సొంతగడ్డపై టీమిండియా ఓ కఠినమైన జట్టు. స్పిన్‌ను ఎదుర్కోవడం అత్యంత కీలకం. నా ప్లాన్స్‌పై స్పష్టతతో ఉన్నా" అని లబుషేన్ చెప్పాడు.

తొలి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి
25 ఏళ్ల లబుషేన్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైన తర్వాత తొలి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఆస్ట్రేలియా తన సిరిస్‌లో భాగంగా జనవరిలో భారత్‌లో పర్యటించనుంది.

జనవరి 14న భారత్-ఆసీస్‌ల మధ్య తొలి వన్డే
ఈ పర్యటనలో భాగంగా భారత జట్టుతో మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. జనవరి 14న ముంబైలో ప్రారంభమయ్యే ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న లబుషేన్ కఠినమైన పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు కేవలం 14 టెస్టులు మాత్రమే ఆడిన లబుషేన్ ఐసీసీ ఇటీవల ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 827 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications