నీ భార్యను 14 రోజులు ఇవ్వూ... బెన్‌ స్టోక్స్‌పై వెస్టిండీస్ క్రికెటర్ అసభ్య పదజాలం!

హైదరాబాద్: ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బెన్ స్టోక్స్‌పై వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. ఓ అంతర్జాతీయ క్రికెటరనే సోయి మరిచి '14 రోజులు నీ భార్యను ఇవ్వంటూ'స్టోక్స్‌పై రాయలేని పదజాలంతో మండిపడ్డాడు. శ్వేత జాతీయులపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. మాములుగానే మైదానంలో వీరిద్దరూ పాము-ముంగిసలా వాదాలాడుకుంటారు.

ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరిగిన వీరిద్దరి మధ్య సంభాషణ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఒకరికొకరు బద్ద శత్రువులుగా భావించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్యామూల్స్ పేరు స్టోక్స్ నోట రావడమే పాపం అయింది. ఈ ఇంగ్లండ్ క్రికెటర్ నోట తన పేరు రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్యామూల్స్.. ముందు వెనుకా ఆలోచించకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోక్స్‌పై బూతుపురాణం అందుకున్నాడు.

ఇంతకేం జరిగిందంటే..

ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్‌లో స్టోక్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆలస్యంగా ఈ టోర్నీలో పాల్గొన్న స్టోక్స్.. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టాడు. అంతకుముందు తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా పాకిస్థాన్‌ టెస్ట్ సిరీస్ నుంచి అర్దాంతరంగా తపుకున్నాడు.

వెంటనే న్యూజిలాండ్ బయల్దేరాడు. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్స్‌లో 14 రోజుల క్వారంటైన్ పాటించాడు. అయితే ఈ క్వారంటైన్ పరిస్థితి గురించి ఇటీవల మాట్లాడిన స్టోక్స్.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకుడదని, తాను బద్ద శత్రువుగా భావించే శ్యామూల్స్‌కు కూడా రావద్దని కోరుకుంటానని సరాదాగా చెప్పుకొచ్చాడు. ప్రభుత్వాలు ఇచ్చే హోటల్‌ను బట్టి క్వారంటైన్ కష్టాలు ఉంటాయని, మంచి హోటల్ దొరికితే పర్లేదని, కానీ దురదృష్టవశాత్తు అలా జరగకుంటే నరకమేనన్నాడు.

స్టోక్స్ కామెంట్స్‌ను అపార్డం చేసుకోని..

స్టోక్స్ కామెంట్స్‌ను అపార్డం చేసుకోని..

స్టోక్స్ నోట తన మాట రావడమే తప్పుగా భావించిన శ్యామూల్స్.. అతని వ్యాఖ్యలను అపార్దం చేసుకొని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. తన ఇన్ స్టా స్టోరీల్లో రాయలేని పదాలతో వరుసగా కామెంట్స్ చేశాడు.‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించరా.. 14 సెకన్లలో జమైకన్‌గా మార్చుతా.'అంటూ రాయలేని పదాలతో బూతుపురాణం అందుకున్నాడు. ఇక శ్యామూల్స్ తీరుపై యావత్ క్రికెట్ ప్రపంచం మండిపడుతుంది. స్టోక్స్‌పై ఇంత విద్వేశం దేనికంటూ నిలదీస్తోంది.

 మైదానంలో స్టోక్స్ X శ్యామూల్స్

మైదానంలో స్టోక్స్ X శ్యామూల్స్

2015లో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో శామ్యూల్స్ అవుటై పెవిలియన్ కు వెళ్తుండగా బౌండరీ లైన్ వద్ద ఉన్న స్టోక్స్ అతడ్ని రెచ్చగొట్టాడు. "ఇక వెళ్లి స్టేడియంలో కూర్చో" అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అంతే కాకుండా 2016 టీ20 వరల్డ్ కప్ లోనూ వీరి మధ్య ఆసక్తికరమైన వాగ్వాదం జరిగింది. ఇంగ్లండ్ జట్టుపై శామ్యూల్స్ చెలరేగిపోతున్న సమయంలో స్టోక్స్ మాటలకు పని చెప్పాడు. ఆ సమయంలో నీ పని నువ్వు చేసుకో అంటూ శామ్యూల్స్ కూడా దీటుగానే బదులిచ్చాడు.

Ind vs Aus: విరాట్ కోహ్లీతో వైరమే.. రోహిత్ శర్మ వేటుకు కారణమా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, October 27, 2020, 17:27 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X