
హైదరాబాద్: ఈ ఏడాది నుంచే ఐపీఎల్‌లో ఆరంభించిన కొత్త సదుపాయాన్ని కూడా వాడుకోకుండా జట్టును వైదొలిగేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 11నుంచి ఆటగాళ్లు బదిలీ అయ్యేందుకు అవకాశం ఉంటుందని ఐపీఎల్ నిర్వహక సంఘం ప్రకటించినా ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ లీగ్ మొత్తాన్ని వదిలేసేందుకు సిద్ధమైయ్యాడు.
ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. వాంఖడేలో టోర్నమెంట్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆడిన మార్క్‌వుడ్ కనీసం ఒక్క వికెట్ కూడా తీయకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు.
ప్రస్తుతం తుది జట్టులో చోటులేక రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో స్వేదేశానికి బయలుదేరి వెళ్లి దుర్హం కౌంటీ తరఫున బరిలో దిగాలని ఆశిస్తున్నాడు. సుధీర్ఘ పర్యటనలో భాగంగా పాకిస్థాన్, భారత్ జట్లు త్వరలో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నాయి. టెస్టు టీమ్‌లో తిరిగి చోటు దక్కించుకోవాలంటే చాలా కఠిన సాధన చేయాలి.
'ప్రస్తుతం సీఎస్‌కే తుది జట్టులో లేను. స్వదేశానికి వెళ్లి దుర్హం తరఫున గొప్పగా రాణించి టెస్టు జట్టులో స్థానం సంపాదించాలని భావిస్తున్నా'నని సోషల్‌మీడియా ద్వారా మార్క్ వెల్లడించాడు.