'టీమిండియాపై ఆశల్లేవు.. టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ 4-0తో గెలుస్తుంది'

మెల్‌బోర్న్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమిండియా తిరిగి పుంజుకొనే అవకాశాల్లేవని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా అన్నాడు. అనువైన పరిస్థితులున్న అడిలైడ్‌లో మూడోరోజే కుప్పకూలిన భారత్.. మిగిలిన సిరీసులో రాణించడం కష్టమన్నాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. అయితే డే/నైట్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లీసేన లోపాలు బయటపడ్డాయి. ఇక పెటర్నిటీ లీవ్ మీద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు రానుండగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును నడిపించనున్నాడు. తొలి టెస్ట్ ఓడిన టీమిండియాకు కోహ్లీ కూడా లేకపోవం లోటే.

ఏమాత్రం ఆశల్లేవు
తొలిటెస్టు ఓటమి తర్వాత భారత్ పుంజుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించగా.. 'ఏమాత్రం ఆశల్లేవు' అని మార్క్ వా అన్నాడు. 'పేపర్‌పై చూసినా టీమిండియా గెలవగలిగేది అడిలైడ్‌లో మాత్రమే. అందులోనూ విరాట్ కోహ్లీ ఒక్క టెస్టుకే అందుబాటులో ఉంటాడు. అక్కడి పరిస్థితులు వాళ్లకు నప్పుతాయని అనుకున్నాను. కానీ మూడో రోజు ఆసీస్ చేతిలో భారత్ విలవిల్లాడటం చూస్తుంటే ఇక పుంజుకోవడం అసాధ్యమనే అనిపిస్తోంది. సిరీస్‌ను ఆసీస్ 4-0తో గెలుచుకుంటుంది' అని మార్క్ వా జోస్యం చెప్పాడు.

ఏకైక అవకాశం అడిలైడ్ మాత్రమే
ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ సైతం మార్క్ వా అభిప్రాయంతో ఏకీభవించాడు. అడిలైడ్‌లో మాత్రమే టీమిండియాకు గెలుపు అవకాశాలు ఉన్నాయని ఇక పుంజుకోవడం కష్టమేనని పేర్కొన్నాడు. 'ఈ పరాజయం (డే/నైట్ టెస్ట్) నుంచి భారత్ కోలుకోగలదని నేను అనుకోను. సిరీస్‌లో భారత్‌కు మ్యాచ్ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలైడ్‌లో తొలి టెస్టు. అక్కడికి పరిస్థితులు భారత బౌలర్లకు సహకరించాయి. పరుగులు కూడా బాగానే చేశారని అనుకున్నా. సిరీస్‌లో భారత్ ఇక పుంజుకుంటుందని అనుకోను' అని చెప్పాడు. హడిన్ ఆసీస్ తరఫున 66 టెస్టులు, 126 వన్డేలు, 34 టీ20లు ఆడాడు.

టీమిండియా పుంజుకోవడం కష్టం
'మిగిలిన మూడు టెస్టుల్లో ఒకటి బ్రిస్బేన్‌లో జరగాల్సివుంది. అక్కడ ఎవరూ ఆసీస్‌ను ఓడించలేరు. వచ్చే రెండు టెస్టుల్లో పిచ్ భారత క్రికెట్‌కు సరిపోతుంది. కానీ ఆ జట్టు పుంజుకోవడం కష్టం. కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు భారత్‌కు గొప్ప బౌలింగ్ దళం ఉంది. ఇప్పుడు సీనియర్ ఇషాంత్ శర్మ లేడు. మొహ్మద్ షమీ గాయంతో దూరమయ్యాడు. షమీ స్థానాన్ని భర్తీ చేసే బౌలింగ్ వనరులు భారత్‌కు లేవు' అని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ అన్నాడు. మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26న రెండో టెస్టు మొదలయ్యే సంగతి తెలిసిందే.

కోహ్లీ హితోపదేశం
త్వరలో తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి పయనమయ్యాడు. అంతకన్నా ముందు అతను సహచరులతో మాట్లాడాడు. రాబోయే మూడు టెస్టుల్లో ఎలా ఆడాలనే విషయంపై హితోపదేశం చేశాడు. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత.. జట్టును వీడుతున్న నేపథ్యంలో సహచరుల్లో స్ఫూర్తిని నింపేందుకే జట్టు మేనేజ్‌మెంట్ ఈ సెషన్‌ను నిర్వహించింది.
స్వదేశంలో సాహా.. విదేశాల్లో పంత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెస్కే సూచన
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications