Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుర్ర తక్కువోళ్లు: విండీస్‌కు సారీ చెప్పిన మాజీ క్రికెటర్

లండన్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ సోమవారం నాడు వెస్టిండీస్ ఆటగాళ్లకు క్షమాపణ చెప్పాడు. విండీస్ ఆటగాళ్లను బుర్ర తక్కువ వాళ్లని కొద్ది రోజుల క్రితం మార్క్ నికోలస్ వ్యాఖ్యానించాడు. దానిపై విండీస్ కెప్టెన్ డారెన్ సామి శనివారం నాడు ఘాటుగా స్పందించారు.

ఆ తర్వాత ప్రపంచ కప్ ట్వంటీ 20 ఫైనల్లో ఇంగ్లాండ్ పైన విండీస్ గెలిచింది. కప్ గెలిచిన తర్వాత కూడా డారెన్ సామి మరోసారి.. మార్క్ నికోలస్ వ్యాఖ్యలను గుర్తు చేశాడు. ఈ వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. సామి ఉద్వేగానికి లోనయ్యాడు.

Mark Nicholas apologises to Darren Sammy for 'Short of Brains' comment

ఈ నేపథ్యంలో మార్క నికోలస్.. డారెన్ సామికి, విండీస్ జట్టుకు క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశ్యం అది కాదని చెప్పాడు. సందర్భానుచితం ఆ కాలమ్ రాసినట్లు చెప్పాడు. డారెన్ సామికి తాను భేషరతుగా క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. ఏదేమైనా నేను సారీ చెబుతున్నానని అన్నాడు.

కాగా, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ చేసిన వ్యాఖ్యల పైన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్వంటీ 20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు మార్క్ నికోలస్ మాట్లాడుతూ... వెస్టిండీస్ క్రికెటర్ల పైన ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

అయితే, సామి ఎక్కడా మార్క్ నికోలస్ పేరు ఎత్తలేదు. ఆయన పేరు ఎత్తకుండా స్పందించాడు. ఆ వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నాడు. బుర్ర లేని వాళ్లంటూ మనుషుల్ని ఎవరైనా అంటారా? జంతువులకు సైతం బుర్రలుంటాయని, తాము ఏమీ వస్తువులం కాదని, ఆ వ్యాఖ్య మమ్మల్ని ఎంతగానో బాధించిందన్నాడు.

నేను ఎంతో గౌరవించే వ్యక్తి అలా అనడం చాలా ఉద్వేగాన్ని కలిగించిందన్నాడు. నాలుగేళ్ల క్రితం మేం ప్రపంచ ఛాంపియన్లమని, అలాంటి మమ్మల్ని బుర్ర లేని వాళ్లనడం హద్దులు దాటడమేనని, అయితే ఎవరి అభిప్రాయం వాళ్లదని, మాపై మాకు మాకు నమ్మకం ఉండటం ముఖ్యమని చెప్పాడు. ప్రపంచ క్రికెట్లో తమ ఆటగాళ్లకు సరైన గౌరవం కూడా దక్కట్లేదన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+