Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా జట్టు కోచ్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌

Mark Boucher set to be named South Africas team director

హైదరాబాద్: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్‌ బౌచర్‌ నియమితుడయ్యాడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో జట్టు వైఫల్యం, బోర్డులో అంతర్గత సమస్యల కారణంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుంది.

ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా క్రికెట్‌ను చక్కదిద్దడం కోసం మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితుడు కాగా.. బౌచర్‌ టీమ్ డైరెక్టర్, కోచ్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2016 నుంచి మార్క్ బౌచర్ టైటాన్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు.

అతడి కోచింగ్ నేతృత్వంలో ఆ జట్టు ఫస్ట్ క్లాస్ టైటిల్ నెగ్గడంతో పాటు రెండు వన్డే, టీ20 ట్రోఫీలను గెలుచుకుంది. ఇక, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ నియమిడుయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇటీవలే దక్షిణాఫ్రికా తాత్కాలిక క్రికెట్ డైరెక్టర్‌గా నియమింపబడిన గ్రేమ్ స్మిత్ ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా తరుపున మార్క్ బౌచర్ 147 టెస్టులు, 295 వన్డేలు, 25 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Saturday, December 14, 2019, 14:49 [IST]
Other articles published on Dec 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+